‘బాహుబలి 2’ మరి కొద్దిరోజులలో విడుదలకాబోతున్న నేపధ్యంలో ఈసినిమా ప్రమోషన్ ను మన దక్షిణభారత దేశంలోని ప్రధాన నగరాలలో రాజమౌళి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాడు. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు ఈసినిమాలో నటించిన నటీనటులు అంతా వస్తున్న నేపధ్యంలో ఏనగరంలో ఈమూవీ ప్రమోషన్ కార్యక్రమం జరిగినా ఆకార్యక్రమం అత్యంత కోలాహలంగా జరుగుతోంది. 

ఇదిఇలా ఉండగా నిన్న చెన్నైలో జరిగిన ‘బాహుబలి 2’ ప్రమోషన్ ఫంక్షన్ కు వచ్చిన అనుష్క ఈసందర్భంలో తనను కలిసిన మీడియా వర్గాలతో మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లి పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.  ఈమూవీ పూర్తి అయ్యే వరకు పెళ్ళికిదూరంగా ఉండాలని ప్రభాస్ ఎప్పుడు నియమం పెట్టుకోలేదని దీనికి సంబంధించి ఇప్పటివరకు మీడియాలో వచ్చిన వార్తలు అన్నీ రూమర్లు మాత్రమే అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది దేవసేన. 

అయితే ప్రభాస్ పెళ్లి ఎప్పుడో తనకు తెలియదు అనిఅంటూ బహుశా ప్రభాస్ కు నచ్చిన అమ్మాయి ఇంకా దొరికి ఉండకపోవచ్చు అని అంటూ అనుష్క ప్రభాస్ పెళ్లి పై కోలీవుడ్ మీడియాకు ట్విస్ట్ ఇవ్వడం ఇప్పుడు లేటెస్ట్ హాట్ న్యూస్ గా మారింది. కొంతకాలం క్రితం పెళ్లి ప్రభాస్ తన కుటుంబ సభ్యులు సూచించిన వైజాగ్ కు చెందిన ఒక అమ్మాయిని ఎంపిక చేసాడని ఆఅమ్మాయి ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార్తె అని ప్రచారం జరిగినవిషయం తెలిసిందే. 

అయితే ఈవార్తలను అప్పట్లో కృష్ణంరాజు ఖండించి ‘బాహుబలి’ ప్రాజెక్ట్ తరువాత ప్రభాస్ పెళ్లి ఉండవచ్చు అన్న సంకేతాలు ఇచ్చాడు. ఇప్పుడు అనుష్క ఇలాంటి ట్విస్ట్ ఇవ్వడంతో ఈసంవత్సరం కూడ ప్రభాస్ పెళ్ళికొడుకుగా మారడం పగటికలే అనుకోవాలి. ఇదిఇలా ఉండగా ‘బాహుబలి 2’ విడుదలకు ఒకరోజు ముందు సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న భారీమూవీ టీజర్ ను విడుదలచేసి ప్రభాస్ అభిమానులకు షాక్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు టాక్.  

దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభాస్ మీద కొన్నికీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. అందుకోసమే యూవీ క్రియేుషన్స్ హడావుడిగా ‘సాహో’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించింది అన్నవార్తలు కూడా ఉన్నాయి. జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్రభాస్ ను సరికొత్త గెటప్ లో చూపెట్టబోతున్న ఈసినిమాను కూడ ఇదేసంవత్సరం విడుదల చేయాలి అని ప్రభాస్ భావిస్తున్న నేపధ్యంలో ఇక ప్రభాస్ పెళ్లి ఈ సంవత్సరానికి లేదనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: