తెలుగు ఇండస్ట్రీలో ఢీ,రెడీ,బాద్ షా,దుబాయ్ శీను, దూకుడు  లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన దర్శకులు శ్రీను వైట్ల. గత మూడు సంవత్సరాల నుంచి ఈ డైరెక్టర్ అదృష్టం అస్సలు బాగాలేదని చెప్పాలి.  ఓ వైపు సినిమా ఫ్లాపులు..మరోవైపు కుటుంబ సమస్యలతో సతమతమయ్యాడు.  ప్రస్తుత మెగా అబ్బాయి వరుణ్ తేజ్ తో ‘ మిస్టర్’ తో ‘మిస్టర్‌’తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇదిలా ఉంటే ఆ మధ్య ఫ్లాప్‌లో ఉన్నప్పుడు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులనే ఎదుర్కొన్నాడు ఈ డైరక్టర్‌.
Image result for mister posters
 ఇక ముకుంద చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘కంచె’ చిత్రంలో నటించారు.  ఈ చిత్రం జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు కైవసం చేసుకుంది.  తర్వాత పూరి జగన్నాధ్  దర్శకత్వంలో ‘లోఫర’ లో నటించాడు..కానీ ఇది డిజాస్టర్ గా మిగిలిపోయింది.  దీంతో కాస్త ఆచీ తూచీ అడుగులు వేస్తున్న వరుణ్ ‘మిస్టర్‌’తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.  
Related image
ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు పెరిగిపోయాయి. అంతే కాదు మిస్టర్ లో ఇద్దరు ముద్దు గుమ్ములు హేబా పాటిల్, లావణ్యా త్రిపాఠి నటిస్తున్నారు.  ఈ చిత్రం రేపు విడుదల కాబోతుంది. మిస్టర్ మంచి హిట్ అయితే ఇండస్ట్రీలో ఈ ఇద్దరికి కొంత కాలం ఢోకా లేదని తేలిపోతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: