భారతీయ భాషల్లో పురాణాలు రామాయణం, మహాభారత ఎంతో ప్రసిద్ది చెందాయి.  కలియుగం ఉన్నంత వరకు ఈ పురాణాలు ఎప్పుడు నిత్యనూతనంగానే ఉంటాయి. ముఖ్యంగా రామాయణ, మహాభారం పై ఎన్నో చిత్రాలు, టీవీ సీరియల్స్ వచ్చాయి. అయినా ఇప్పటికీ, ఎప్పటికీ రామాయణ మహాభారతాలు కొత్తగానే కనిపిస్తాయి.  ఇప్పుడు మహా ఇతిహాసం మహాభారతాన్ని ఇప్పుడు వెయ్యి కోట్లతో తెరకెక్కించడం టాపిక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. యూ.ఏ.ఈ కి చెందిన ఓ భారతీయ వ్యాపారవేత్త ఈ సినిమాకోసం ఏకంగా రూ.1000 కోట్ల పెట్టుబడి పెడుతున్నాడు.

ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు. మొదటగా ఈ సినిమాని ఇంగ్లీష్, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో తెరక్కిస్తారు. ఆ తర్వాత 100 విదేశీ భాషల్లో డబ్బింగ్‌ చేస్తారు. పద్మభూషణ్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎంటీ వాసుదేవన్ నాయర్ రచించిన రందమూళమ్ పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది . మహాభారతం సినీరంగంలో ఒక నిరంతర స్రవంతి. ఒక జీవనది.

ఆ ఇతిహాసాన్ని ఎన్ని సార్లు చదివినా తనివి తీరదు. దాన్ని భారీ స్థాయిలో సినిమా తీయాలనే ఆలోచనల రావడం సంతోషదాయకం. భారతీయులతో పాటు విదేశీయులు ఈ చిత్రంలో నటించనున్నట్టు తెలుస్తుండగా, ఈ ప్రాజెక్ట్ 2018 సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. అయితే ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ భీముడుగా నటించనున్నట్టు తెలుస్తుంది. ఇక బిగ్ బీ అమితాబ్ భీష్ముడిగా నటిస్తాడని ప్రచారం జరుగుతుంది. మరి వీటిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: