ప్రముఖ నటుడు బ్రహ్మాజీ చేసిన ఒక షాకింగ్ ట్విట్ ఇప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. సామాన్యంగా సెలెబ్రెటీలు తమ కుటుంబంలో జరిగే ఆనందకర సంఘటనలను అందరితో షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే వారి కుటుంబంలో ఏదైనా దురదృష్టకర సంఘటనలు జరిగితే వాటిని అందరితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. 

అయితే దీనికి భిన్నంగా బ్రహ్మాజీ తన కుటుంబలో జరిగిన దురదృష్టకర సంఘటనను అందరికీ తన ట్విటర్ ద్వారా తెలియచేసి ఆ దురదృష్టకర సంఘటనకు శుభాకాంక్షలు చెప్పమని అడుగుతున్నాడు.  తన కుమారుడు సంజయ్, అతని భార్య ఇంద్రాక్షి గత 5 నెలలుగా విడిపోయి ఉన్నారని వాళ్లిద్దరూ త్వరలోనే విడాకులు కూడా తీసుకుంటారని చెప్తూ ఈ జంట విడిపోయాక మరో కొత్త జీవితం ప్రారంభించాలని ట్విట్టర్ ద్వారా బ్రహ్మాజీ కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియచేయమని అడగడం ఇక్కడ ఇదొక ట్విస్ట్. 

బ్రహ్మాజీ కొడుకు సంజయ్ పెళ్ళి 2013 లో బెంగాళీ అమ్మాయిఇంద్రాక్షి తో జరిగింది. ఆమె  కలకత్తాలోను ఫ్యాషన్ డిజైనర్. అయితే వీరిద్దరి మధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు వీరిద్దరూ విదిపోతున్నట్లుగా బ్రహ్మాజీ తెలియచేసి అందరికీ షాక్ ఇచ్చాడు. 

గత కొద్దిరోజులుగా బ్రహ్మాజీ కొడుకు కూడ హీరోగా మారబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా విషయమై క్లారిటీ లేదు. ఈ మధ్య కాలంలో చాలామంది టాప్ హీరోల సినిమాలలో బ్రహ్మాజీ రకరకాల పాత్రలను చేస్తూ ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. ఈ నేపధ్యంలో బ్రహ్మాజీ తన కొడుకు విడాకుల విషయాన్ని ఈ విధంగా బయట పెట్టి మీడియాకు హాట్ టాపిక్ గా మారాడు..  



మరింత సమాచారం తెలుసుకోండి: