ప్రస్థుత తరం హీరోల రేస్ లో గోపీచంద్ చాల వెనకబడి ఉన్నాడు. అయినా తన ఇమేజ్ ని మెరుగు పరుచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ప్రస్తుతం మూడు సినిమాలలో నటిస్తూ ఎదో ఒక సినిమా అయినా తన అదృష్టం తిప్పక పోతుందా అన్న ఆశలతో రోజులు గడుపుతున్నాడు. బి. గోపాల్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి 'ఆరడుగుల బుల్లెట్‌' అనే టైటిల్‌ పెట్టిన విషయం తెలిసిందే.

అదేవిధంగా గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో నటిస్తున్న మరొక సినిమాకు ‘గౌతమ్ నంద’ టైటిల్ పెట్టుకున్నాడు. ఈ టైటిల్ తో తనకు ‘అత్తారింటికి దారేది’ మూవీతో పవన్ కు వచ్చిన క్రేజ్ లో కనీసం ఒక పావు వంతు అయినా రాక పోతుందా అన్న ఆశతో ఉన్నాడు గోపీచంద్. 

ఈ రెండు సినిమాలతో పాటుగా గోపీచంద్ నటిస్తున్న మరో చిత్రానికి పవన్‌తో ఇన్‌ డైరెక్ట్‌ లింక్‌ వుంది. గోపీచంద్ 'ఆక్సిజన్‌' చిత్రానికి నిర్మాత ఎ.ఎం. రత్నం. ఈ చిత్ర నిర్మాత ప్రస్తుతం ఆర్ధిక సమస్యలలో చిక్కుకున్నాడు అన్న వార్తలు ఉన్నాయి.

దీనితో  ‘ఆక్సిజన్’ విడుదలకి లైన్‌ క్లియర్‌ అవ్వాలంటే పవన్‌తో ఎ.ఎం.రత్నం తీయబోతున్న సినిమా పట్టాలు ఎక్కాలి. అందుకే ఆక్సిజన్‌ పూర్తి కాకుండానే పవన్‌, నీసన్‌ల కాంబినేషన్ లో రత్నం సినిమాను మొదలు పెట్టినా ఈ సినిమా గురించి ప్రస్తుతం పవన్ పట్టించుకోవడం లేదు. 

దీనితో గోపీచంద్ నటిస్తున్న మూడు సినిమాలకీ పవన్‌తో అనుకోకుండా లింక్‌ ఏర్పడిపోయింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘లౌక్యం’ సక్సస్ తో తిరిగి సక్సస్ ట్రాక్ గోపీచంద్ ఎక్కాడు అని భావించినా ఆ తరువాత విడుదలైన సినిమాలు అన్నీ వరస పరాజయాలుగా మారడంతో ప్రస్తుతం గోపీచంద్ నటిస్తున్న ఈ మూడు సినిమాలలో ఏ ఒక్కటి హిట్ కాకపోయినా గోపీచంద్ కెరియర్ సమస్యలలో పడినట్లే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: