మహానటి సావిత్రికి అలనాటి ప్రభుత్వాల నుండి ఒక్క అవార్డ్ కూడ రాలేదు. అయినా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారి హృదయాలలో ఆమె ఎప్పుడూ మహానటిగానే కొనసాగుతోంది. అటువంటి ఆ మహానటి జీవితంలో ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి. 

ప్రస్తుతం ఆమె జీవితంపై యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘మహానటి’ అన్న పేరుతో సినిమాను తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈసినిమా గురించి అదేవిధంగా ఆమె జీవితం గురించి ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి తెలియ చేసింది. 

అదేవిధంగా తన తండ్రి జెమినీ గణేషన్ తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించింది చాముండేశ్వరి. తనకు 16 ఏళ్ల వయస్సులోనే తనకు పెళ్లి అయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ అప్పటికే ప్రతిరోజు తన తల్లితండ్రులు ప్రతి విషయంలోనూ తీవ్రమైన విభేదాలతో ఒకరిపై ఒకరు అసహనంతో నిందలు మోపుకున్న పరిస్థితి తనకు గుర్తు ఉంది అని అంటూ అసలు తన తల్లితండ్రుల మధ్య ఆ స్థాయిలో విభేదాలు ఎందుకు తలఎత్తాయో తనకు తెలియదు అని అంటోంది. 

అయితే ఈ పరిస్థుతుల ప్రభావం తనకన్నా తన తమ్ముడు పై తీవ్ర ప్రభావాన్ని చూపించిన సంఘటనలను ఆమె గుర్తుకు చేసుకుంది. అయితే ఆమె చాలామంది అనుకుంటున్నట్లుగా తీవ్ర ఆర్ధిక సమస్యల మధ్య ఆమె జీవితం ముగిసి పోలేదని కేవలం ఆమెకు సమస్యలు ఎదురైనప్పుడు సలహాలు ఇచ్చే సన్నిహితులు లేకపోవడంతో ఆమె మద్యానికి అలవాటు పడిన వాస్తవాన్ని ధైర్యంగా బయట పెట్టింది విజయ చాముండేశ్వరి.

ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ ఎన్నో క్లిష్టమైన పాత్రలను సినిమాలలో నటించి మెప్పించిన సావిత్రి తన జీవితంలో తెలివిగా విజయవంతంగా జీవించలేక పోయింది అంటూ మరో షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే తన తండ్రి జెమినీ గణేషన్ సావిత్రి కోమాలో ఉన్నప్పుడు చివరి దశలో తనతో పాటు హాస్పటల్ లో ఉన్న విషయం చాల తక్కువమందికి తెలుసు అంటూ తన తండ్రిని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేసింది విజయ చాముండేశ్వరి. అయితే ప్రస్తుతం నిర్మిస్తున్న సావిత్రి ‘మహానటి’ మూవీ పై స్పందిస్తూ తన తల్లి గురించి ఒక్క నెగిటివ్ పాయింట్ ను ఆ సినిమాలో చూపెట్టినా తాను అంగీకరించను అని చాముండేశ్వరి స్పష్టం చేసిన నేపధ్యంలో వాస్తవాలను చూపించకుండా సావిత్రి  జీవితాన్ని సినిమాగా తీస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా ? అన్నదే సందేహం..   


మరింత సమాచారం తెలుసుకోండి: