నిన్నరాత్రి చిరంజీవి రామ్ చరణ్ లు చరిత్రలను తారుమారు చేస్తున్న ‘బాహుబలి 2’ ను ప్రసాద్ ఐ మాక్స్ ధియేటర్ లో చూసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈసినిమాను చూసిన తరువాత రామ్ చరణ్ తన తండ్రితో తీయబోతున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ మూవీ యాక్షన్ ప్లాన్ అంతా మార్చివేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

మొదట్లో ఈమూవీకి అనుకున్న బడ్జెట్ ను పూర్తిగా మార్చివేసి ఇప్పుడు 125 కోట్ల భారీ బడ్జెట్ తో ఈమూవీని తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఒక స్వాతంత్ర సమరయోధుడి చరిత్రను ఆధారంగా తీయబోతున్న ఈసినిమాకు సంబంధించి భారీ సెట్స్ అదేవిధంగా భారీ గ్రాఫిక్స్ ఉండే విధంగా ‘ఉయ్యాలవాడ’ ను రూపొందించడానికి చరణ్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు టాక్. 

ఈమూవీ మొదలు పెట్టిందగ్గర నుండి ఈ మూవీకి విపరీతమైన హైక్ తీసుకు వచ్చి ఈసినిమా పై 200 కోట్ల బిజినెస్ చేయాలనే పట్టుదలతో రామ్ చరణ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న ‘పద్మావతి’ సినిమాకు గ్రాఫిక్ వర్క్స్ పనులు చేస్తున్న టెక్నికల్ టీమ్ తో ‘ఉయ్యాలవాడ’ ప్రాజెక్ట్ గురించి చరణ్ చాల చర్చలు చేస్తున్నట్లు సమాచారం.

‘బాహుబలి 2’ తరువాత గ్రాఫిక్స్ విషయంలో అదేవిధంగా సెట్స్ విషయంలో సినిమాలు చూసే ప్రేక్షకులు చారిత్రాత్మక జానపద సినిమాలు అంటే ‘బాహుబలి 2’ రేంజ్ లో ఆలోచిస్తారు కాబట్టి ‘ఉయ్యాలవాడ’ స్క్రిప్ట్ ను అనుసరించి బడ్జెట్ పరంగా ఎటువంటి పరిమితులు లేకుండా తీయాలని చరణ్ భావిస్తున్నట్లు టాక్. దీనికోసం ఈసినిమాను కూడ అత్యంత భారీ స్థాయిలో తీయాలని చరణ్ చిరంజీవిలు ఇప్పటికే ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.  

ఇది ఇలా ఉండగా ‘ఉయ్యాలవాడ’ స్క్రిప్ట్ పూర్తి అయినా ఈసినిమా కథ పై చిరంజీవి పలువురు చరిత్రకారుల అభిప్రాయాలను కూడ తెలుసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమా కథ 18వ శతాబ్దం కాలం నాటిది కాబట్టి అప్పటి ప్రజలు ఎలాంటి బట్టలను వేసుకునేవారు అన్న విషయం పై కూడ చరణ్ చాలామంది డ్రెస్ డిజైనర్స్ తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: