Image result for aamir khan dangal china release




నిజంగా చేప్పాలంటే ఆసియాఖండంలోని చైనా భారత్ రెండూ కలిస్తే ప్రపంచం మొత్తన్ని ఏరంగం లోనైనా దున్నెయ్యొచ్చు. సినిమా రంగం లోనూ అంతే .  అయితే విదేశీ సినిమాల విడుదలపై చైనాలో చట్టపరమైన కొన్ని రిస్ట్రిక్షన్లు ఉన్నాయి. 


భారతీయసినిమాలకు అక్కడ ఆదరణ చాలా బాగా ఉంటుంది. ఆమిర్ ఖాన్ నటించిన "రియల్ లైఫ్ స్పోర్ట్స్ డ్రామా - దంగల్" మరోసారి ఋజువు చేసింది. అక్కడ విడుదలైన  తొలిరోజే ఈ సినిమా రూ. 15 కోట్ల కలెక్షన్లు సాధించింది.  "3 ఇడియట్స్ సినిమాను చైనీస్ భాష" లోకి డబ్బింగ్ చేసి విడుదల చేసి, ఆమిర్ ఖాన్ భారతీయ సినిమాలకు అక్కడ మంచి మార్కెట్ సృష్టించాడు. 


Image result for aamir khan dangal china release


"పీకే" సినిమా చైనాలో "ఫుల్ రన్ లో రూ.100 కోట్లు" వసూలు చేసింది. దాంతో "దంగల్" కోసం అక్కడ జనాలు నిరీక్షించారు. ఈ నిరీక్షన కాష్ చేసుకోవటానికి  7 వేల స్క్రీన్లలో "దంగల్"  సినిమాను అక్కడి అతి పెద్ద సినిమా ఎక్జిబిటర్ "వాండా" విడుదల చేసింది.  


Image result for aamir khan dangal china release




చైనాలోని ఈ సినిమాను ప్రదర్శించకూడదని ఎక్జిబిటర్ "వాండా" నిర్ణయించినా. సినిమాపై అక్కడ జనములో ఉన్న డిమాండ్ పసిగట్టి తరవాత రిలీజ్ చేయటానికి సిద్దపడింది.  


సినిమా విడుదల చేయడానికి ముందు దాని ప్రమోషన్ కోసం బీజింగ్, షాంఘై, చాంగ్‌డు నగరాల్లో ఆమిర్ ఖాన్ పర్యటించారు. ఎక్కువగా హాలీవుడ్ సినిమాల డామినేషన్ కనిపించే చైనా మార్కెట్లో బాలీవుడ్ సినిమాలు కూడా ఆకట్టుకుంటాయని ఆమిర్ ఖాన్ ఇప్పటికే తన రెండు సినిమాల ద్వారా నిరూపించారు.


Image result for aamir khan dangal china release



దానికి తోడు ఇటీవలే చైనా కూడా అక్కడ ఏడాదికి ప్రదర్శించే భారతీయ సినిమాల సంఖ్యను రెండు నుంచి నాలుగుకు పెంచింది. చైనా కొత్త సంవత్సరం సమయంలో వచ్చిన జాయింట్ ప్రొడక్షన్ సినిమాలు "కుంగ్‌ఫూ యోగా, బడ్డీస్ ఇన్ ఇండియా"  లాంటి సినిమాలకు కూడా అక్కడ మంచి ఆదరణ కనిపించింది.



జాకీచాన్‌తో పాటు సోనూసూద్ లాంటి కొందరు భారతీయ నటులు కలిసి చేసిన "కుంగ్‌ఫూ యోగా" భారత్ లో పెద్ద విజయం సాధించ్సక పోయినా కాకపోయినా, అక్కడ మాత్రం బాగానే పైసా వసూలు చేసింది. 



Image result for aamir khan dangal china release




చైనాలో ఏడాదికి 34 విదేశీ సినిమాలు మాత్రమే ప్రదర్శించే అవకాశం ఉంది. అందులో భారతీయ సినిమాల కోటాను చాలా ఏళ్ల పాటు రెండుకే పరిమితం చేశారు. ఈమధ్యే దాన్ని డబుల్ చేశారు. చాలావరకు కోటా హాలీవుడ్ సినిమాలకే వెళ్తుంది.


Image result for kung fu yoga


ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీసినిమాలను చైనాలో నేరుగా విడుదల చేయడానికి వీల్లేదు. పీకే సినిమాకు మంచివసూళ్లు వచ్చినప్పటి నుంచి చైనా మార్కెట్లో మన సినిమాలను విడుదల చేయడానికి భారతీయ నిర్మాతలు మంచి ఉత్సాహం చూపిస్తున్నారు.


Image result for aamir khan dangal china release


బాహుబలి 1 విడుదల చేసి చేదు చవి చూసిన రాజమౌళి బాహుబలి 2 విడుదల చైనాలో చేయటానికి ముందు వెనకడుగు వేసినా స్లాట్ దొరికితే వెంటనే విFఉదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 900 కోట్ల రూపాయలు వసూల్ చెసిన బాహుబలి ది కంక్లూజన్ చైనా విడుదలైతే దంగల్ కు కూడా గండికొట్టొచ్చు.   


Image result for aamir khan dangal china release

మరింత సమాచారం తెలుసుకోండి: