యంగ్ హీరో శర్వానంద్‌ తన ప్రతీ సినిమా విడుదలకు ముందు ఎదురవుతున్న సమస్యలకు విసిగి పోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం గత కొంత కాలంగా శర్వానంద్ ప్రతి సినిమా భారీ సినిమాల మధ్య ఇరుక్కుంటూ శర్వానంద్ కు చుక్కలు చూపెడుతోంది. 2016 సంక్రాంతికి ‘నాన్నకు ప్రేమతో’ ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘డిక్టేటర్‌’ చిత్రాల మధ్య ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ చిక్కుకుని చిట్టా చివరికి హిట్ అయింది. 

ఈ ఏడాది సంక్రాంతికి ‘ఖైదీ నంబర్‌ 150’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తో పాటు ‘శతమానం భవతి’ విడుదల అందర్నీ ఆశ్చర్య పరుస్తూ పెద్ద హిట్టయింది. ఇప్పుడు ఈసారి ఏకంగా ‘బాహుబలి 2’ మ్యానియా మధ్య   'రాధ' ఈవారం రిలీజ్‌ చేస్తున్నారు. ‘బాహుబలి’ ధాటికి భయపడి పెద్ద సినిమాలన్నీ జూన్‌ నెలాఖరుకి వాయిదా పడిపోయిన విషయం తెలిసిందే. 

ఈమ్యానియా మధ్య గతవారం విడుదలైన 'బాబు బాగా బిజీ' కూడా నామ రూపాల్లేకుండా పోయింది. దీంతో ‘బాహుబలి’ మ్యానియా నుంచి జనం బయటకి వచ్చి ఇప్పుడు మరో సినిమా చూస్తారా అనే అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అనుమానాలని నివృత్తి చేయడానికి 'రాధ'  విడుదల కాబోతోంది. 

దీనితో ఇంతవరకు ఎదురైన కఠిన పరీక్షల్లో నెగ్గిన శర్వానంద్‌ ఇప్పుడు అన్నిటికంటే అతి పెద్ద పరీక్షకి రెడీ అవుతున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  ఈసారి కూడా ఈపరీక్షలో శర్వానంద్ నెగ్గితే ఈ యంగ్ హీరోకు ఇక ఎదురు లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  

తెలుగు ప్రేక్షకులు శర్వానంద్ సినిమా వస్తోంది అంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చు అనే సంకేతాలు వస్తున్న నేపధ్యంలో మందీ మార్బలం లేకపోయినా వరస హిట్స్ ఇస్తున్న ఈహీరో పారితోషికం కూడ భారీస్థాయిలో పెరిగి పోయింది అన్న వార్తలు వస్తున్నాయి.  తన సినిమా బడ్జెట్ పది కోట్లు దాటడానికి వీల్లేదు అని  నిర్మాతలకు కండిషన్స్ పెడుతూ మంచి కధలను సినిమాలుగా లైన్ లో పెడుతున్న శర్వానంద్ స్ట్రాటజీకి టాలీవుడ్ యంగ్ హీరోలు అంతా షాక్ అవుతున్నారు. దీనితో ఈకీలక పరీక్షలో నెగ్గడం శర్వానంద్ కెరియర్ కు చాల అవసరం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: