ప్రస్తుతం చిరంజీవి నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో మరో నెలరోజులలో పూర్తి కాబోతోంది. దీనితో చిరంజీవి ఈ షోకి సంబంధించిన షూటింగ్స్ హడావిడిలో ఉన్నాడు. వీలైనంత త్వరలో తన ‘కోటీశ్వరుడు’ షో వర్క్ పూర్తి చేసి వెంటనే తన ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ మూవీ ప్రాజెక్ట్ విషయమై శ్రద్ధ పెట్టబోతున్నాడు మెగా స్టార్. 
తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ షూటింగ్ చిరంజీవి పుట్టినరోజునాడు ప్రారంభం అవుతుంది అని అంటున్నారు. అయితే ఈమూవీ ప్రాజెక్ట్ ఫైనల్ అయినా ఈసినిమా కథకు సంబంధించి ఏర్పడ్డ కొన్ని సమస్యలు ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మెగా కాంపౌండ్ ను వెంటాడుతున్నట్లు టాక్. 

కథ రీత్యా ‘ఉయ్యాలవాడ’ కథ తెలుగు ప్రజలకు ఏమాత్రం పరిచయం లేనిది. అంతేకాకుండా కేవలం ఒక 2 వేలమంది అనుచరులతో అలనాటి బ్రిటీష్ వారి పై తిరుగుబాటు చేసిన ‘ఉయ్యాలవాడ’ ను అలనాటి బ్రిటీష్ సైనకులు ఒకరోజు అర్దరాత్రి ‘ఉయ్యాలవాడ’ ను అతడి ఇంటి నుండి పట్టుకుని ఆ తరువాత 30 రోజులు అనేక హింసలు పెట్టి చిట్టచివరకు అతడిని చంపి అతడి తలను కోటకు వేలాడ తీస్తారు. 

అయితే ఈ ముగింపు మెగా అభిమానులకు ఏమాత్రం రుచించదు. మరొక ముగింపు ఈకథకు ఇస్తే చరిత్రను తప్పుదారి పట్టించినట్లు అవుతుంది. దీనికితోడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కి ఇద్దరు భార్యలు అని కొందరు ముగ్గురు భార్యలు అని మరికొందరు చరిత్ర కారులు వాదిస్తున్నారు. 

ఈ విషయాలతో పాటు ‘ఉయ్యాలవాడ’ బ్రిటీష్ వారి పై చేసిన పోరాటానికి సంబంధించిన కథనాలు కూడా చరిత్రలో స్పష్టంగా లేవు. దీనితో అన్నీ ఊహలకు మాత్రమే ఈకథలో తావు ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో ఎన్నిసార్లు మార్పులు చేర్పులు చేసినా ఈమూవీ స్క్రిప్ట్ లో ఏదో ఒక లోటు బయటపడుతోంది అని టాక్.

ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో ఇప్పుడు ఈసినిమా స్క్రిప్ట్ కు డైలాగ్స్ వ్రాస్తున్న సాయిమాధవ్ బుర్రా తన కలానికి చాల పదును పెట్టి కేవలం ఉద్వేగభరితంగా ఉండే డైలాగ్స్ తో ఈసినిమాను గట్టెంకించవలసిన పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: