తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంత గొప్ప మాస్ ఇమేజ్ సంపాదించిన హీరో అజిత్ కుమార్.  అచ్చమైన తెలుగు అబ్బాయి..తెలంగాణలోని హైదరాబాద్ లో పుట్టి పెరిగాడు.  తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన ప్రేమ పుస్తకంతో ప్రారంభించాడు. సికింద్రాబాద్లో పుట్టిన అజిత్.. పదోతరగతి వరకు మాత్రమే చదివినా, అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళంతో పాటు ఇంగ్లీషు పరిజ్ఞానం కూడా అజిత్ కు ఎక్కువే. ఒకప్పటి టాప్ హీరోయిన్ షాలినిని 2000 సంవత్సరంలో పెళ్ళి చేసుకున్నాడు.
Image result for hero ajith injured
ప్రేమ పుస్తకం తర్వాత తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన అజిత్ అక్కడ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన మంచి పేరు తెచ్చుకున్నాడు.  తెలుగు, తమిళంలో అజిత్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది.  తాజాగా ‘వివేగం’ సినిమాలో నటిస్తున్నాడు.  ఈ చిత్రంలో అజిత్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు.  ఈ చిత్రం షూటింగ్ కి సంబంధించి అజిత్‌ గాయపడినట్లు సమాచారం.
Image result
ఎలాంటి డూప్‌ లేకుండా  స్టంట్‌లో పాల్గొన్న హీరో, ఆ సమయంలో ప్రమాదవశాత్తూ కిందపోయాడు. వెంటనే భుజానికి గాయమైనట్లు తెలుస్తోంది. గతంలో కూడా అజిత్ కొన్ని సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించి గాయాల పాలయ్యారు.  ‘వివేగం’ చిత్రానికి కూడా ఎలాంటి డూప్‌ లేకుండా  స్టంట్‌లో అజిత్ మరోసారి గాయపడ్డాడు.  
Image result for hero ajith family
అజిత్ ని వెంటనే  దగ్గరలో ఆసుపత్రికి యూనిట్ సభ్యులు  తరలించారు. ఈ విషయం తెలిస్తే అభిమానులు కంగారు పడతారని భావించిన యూనిట్‌ సభ్యులు, బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శివ డైరెక్షన్‌లో రెడీ అవుతోన్న ఈ చిత్రాన్ని ఆగస్టు 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. 



మరింత సమాచారం తెలుసుకోండి: