భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంచలనాలు సృష్టించి.. సాక్షాత్తు  చైనా అధ్యక్షుడే మెచ్చుకున్న చిత్రం ‘దంగల్’.   దంగల్ సినిమాలో గీతా ఫోగట్ యంగ్ రోల్ ప్లే చేసిన ఓ 16 ఏళ్ల అమ్మాయే ఈ జైరా. దంగల్ సినిమా రిలీజ్‌కి ముందు ఎక్కడా అంతగా ప్రచారంలో లేని ఈ పేరు సినిమా రిలీజ్ తర్వాత బాగా పాపులర్ అయిపోయింది.  

గురువారం జైరా వాసిమ్‌ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బౌలేవార్డ్ రోడ్ సమీపంలో దాల్‌ లేక్‌లో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆమెను రక్షించారు. జైరా ఎటువంటి గాయాలు లేకుండా బయటపడినా ఆమెతో ఉన్న వ్యక్తి తీవ్ర గాయాలపాలైనట్టు స్థానికులు తెలిపారు.బాలీవుడ్‌ చిత్రం 'దంగల్‌'లో తన సహజ నటనతో మెప్పించిన నటి జైరా వాసిమ్‌ తృటిలో ప్రాణాలతో బయటపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 బౌలెవర్డ్ రోడ్‌లో ఆమె ప్రయాణిస్తున్న కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవొచ్చని స్థానికులు చెబుతున్నారు.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో  ఈ అమ్మడు  సినిమా చూడటానికి వెళ్ళి థియేటర్ లో జాతీయ గీతం వస్తున్నా నిలబడకుండా ఉండి ఇంకో సారి వివాదం లో ఇరుక్కుంది. ఇలా తన సినిమా కంటే వివాదాల్లోనే ఎక్కువ పాపులర్ అయిన ఈ అమ్మాయి ప్రమాదం లో గాయపడ్డ సంగతి కాస్త ఆలస్యంగానే బయటికి వచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: