కమల్ హసన్ కుమార్తెగా ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తన తండ్రిలాగే తన మనసులోని మాటలను ఎటువంటి మొహమాటం లేకుండా మాట్లాడుతుంది. ప్రస్తుతం ఆమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి అన్న విషయం పై ఇప్పడు చర్చలు జరుగుతున్నాయి. 

పవర్, ఇన్ ఫ్లుయన్స్ ఉన్న వాళ్లకే సినిమాలలో  అవకాశాలు దక్కుతున్నాయని ఇప్పటికే అనేక  మంది విమర్శలు చేస్తున్న నేపధ్యంలో ఈ కామెంట్స్ కు మరో ట్విస్ట్ ఇచ్చింది శ్రుతిహాసన్. తాను నటిగా ఎదగడం వెనుక కమలహాసన్ వారసత్వం ఏమాత్రం సహాయపదలేదని కేవలం తాను తన స్వశక్తితో ఎదిగిన విషయాన్ని బయటపెట్టింది శ్రుతి. 

అంతేకాదు ఈ విషయం తనకు మాత్రమే కాకుండా సినిమా తారల పిల్లలు అందరికీ ఇది వర్తిస్తుంది అని అంటూ కేవలం ప్రతిభ ఉంటేనే రాణిస్తారు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కాయిన్ పైకి విసిరితే బొమ్మ పడుతుందా బొరుసు పడుతుందా అన్న విషయం పై క్లారిటీ ఎలా ఉండదో సినిమా తారల పిల్లలు కూడ సక్సస్ పొందుతారా ? లేదంటే ఫెయిల్ అవుతారా ? అన్న విషయాలు చెప్పడం కష్టం అంటూ ఎవరికైనా సినిమా రంగంలో ప్రతిభ మాత్రమే కొలమానం అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది. 

అయితే శ్రుతిహాసన్ చెప్పిన ఈ బొమ్మా బొరుసు సిద్ధాంతం పై ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. కెరియర్ మొదట్లో అనేక ఫ్లాపులు వచ్చినా శ్రుతిహాసన్ కు పిలిచి అవకాశాలు ఇచ్చిన విషయం వెనుక కమల్ బ్యాక్ గ్రౌండ్ ఆమె మర్చిపోయిందా అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. 

ఇదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనకు వివాహ వ్యవస్థ పై నమ్మకంలేదు అని కామెంట్స్ చేయడమే కాకుండా పిల్లలను మాత్రం తాను కంటాను అని చెప్పడం బట్టి శ్రుతి తన తండ్రి వారసత్వాన్ని అన్ని విషయాలలోనూ కొనసాగిస్తోంది అని అనుకోవాలి.  ఒక విధంగా కమల్ ప్రభావం తనపై లేదు అని చెపుతూనే మరొక విధంగా కమలహాసన్ అభిప్రాయాలను తూచా తప్పకుండా పాటించడం ఒక్క శ్రుతిహాసన్ కే చెల్లింది అనుకోవాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: