పాపులర్ యాంకర్ సుమ కార్యక్రమం నిర్వహించే తీరు చాల విభిన్నంగా ఉంటుంది. ఆమె సున్నితమైన సెటైర్లతో టాప్ సెలెబ్రెటీలను కూడ టార్గెట్ చేస్తూ వేసే సెటైర్లు అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఆనందానికి కూడ గురి చేస్తూ ఉంటాయి. ఈ సమర్ధత వల్లే సుమ ఇప్పటి వరకు 200 లకు పైగా సినిమా ఫంక్షన్స్ కు యాంకరింగ్ చేసేలా చేసింది.

ఇది ఇలా ఉండగా మొన్న సోమవారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన ‘శమంతకమణి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ చేతిలో మైక్ లేకుండా చేసిన యాంకరింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీనితో చేతిలో మైక్ లేకుండా మరి సుమ యాంకరింగ్ ఎలా చేసింది అంటూ చాలామంది ఆశ్చర్య పోయారు.

అయితే లేటెస్ట్ గా వచ్చిన టెక్నాలజీ సహాయంతో  సుమ అప్ డేట్ అయి ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించ కలిగింది అన్న వార్తలు వస్తున్నాయి. చెవి దగ్గర పెట్టుకునే మైక్రో మైక్(ఇయర్ మైక్)తో ‘శమంతకమణి’ ఫంక్షన్‌లో సుమ యాంకరింగ్ చేసింది అని తెలుస్తోంది. 

అయితే ఈ విషయం తెలియక చాలామంది ఆశ్చర్య పోవడమే కాకుండా సుమ మైక్ ను హీరోలు లాగేసుకోవడంతో సుమ అస్త్రాలను కోల్పోయిన కర్ణుడిలా ‘శమంతకమణి’ ఫంక్షన్ వేదిక పై సుమ ఏకాకి అయిపోయింది అంటూ కొందరు జోక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయినా సుమ సమర్థతకు మైక్ లు లేకపోయినా సునామీలు అడ్డు వచ్చినా ఆమె మాటలు అందర్నీ కట్టి పడేస్తాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: