తెలుగు ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన శివ చిత్రం తెలుగు ఇండస్ట్రీ స్టైల్ నే మార్చేసింది.  ఈ చిత్రం నాగార్జున ఫ్రెండ్స్ గా నటించిన వారిలో చిన్నా ఒకరు.  ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో కీలకమైన పాత్రల్లో నటించిన చిన్నా తర్వాత దర్శకత్వం కూడా వహించారు. ప్రస్తుతం చిన్నా ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.  హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన సతీమణి శిరీష (42) కన్నుమూశారు.  

ఈ మద్య తెలుగు ఇండస్ట్రీల వరుస విషాదాలు అలుముకుంటున్నాయి. ఇప్పటికే దాసరి, సినారే, రవితేజ తమ్ముడు భరత్ లు మరణించిన విషయం తెలిసిందే.  దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్నామె హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో నేడు తుది శ్వాస విడిచింది. ఈ విషయాన్ని చిన్నాయే స్వయంగా మీడియాకు తెలియజేశాడు. చిన్నా-శీరిష దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు.

చిన్నా అసలు పేరు జితేంద్రరెడ్డి.. దర్శకుడు రాంగోపాల్ వర్మ శివ మూవీలో హీరో నాగార్జున ఫ్రెండ్ గా చిన్నా బాగా పాపులర్ కావడంతో ఆ పేరుతోనే ఇండస్ట్రీలో కొనసాగారు.  ‘ఆ ఇంట్లో’ అనే సినిమాకు దర్శకత్వం సైతం వహించాడు. అటుతర్వాత టీవీకి షిప్ట్ అయి సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.భార్య మృతి చెంది విషాదం లో ఉన్న చిన్నా ని పలువురు సినీ ప్రముఖులు పరామర్శించి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు . 



మరింత సమాచారం తెలుసుకోండి: