తెలుగు, హిందీ భాషల్లో వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మకు విజయవాడ న్యాయస్థానం పెద్ద షాక్ ఇచ్చింది.  తాను తీసే సినిమాలు ఎప్పుడూ కాంట్రవర్సీలు ఉన్న పెద్దగా పట్టించుకోని వర్మ ఆ మద్య ‘వంగవీటి’ సినిమా పై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు.  ఒకానొకదశలో విజయవాడలో వంగవీటి వర్గీయులకు ఆయనకు పెద్ద యుద్దమే జరిగింది.  తాను తీసిని సినిమా రిలీజ్ కాకుండా ఎవ్వరూ ఆపలేరని కొన్ని సెన్సార్ కటింగ్స్ తో విడుదల చేశారు.  
Image result for vangaveeti ranga movie
అయితే వంగవీటి సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నీవేశాలు ఉన్నాయని..తాము ఎంతగానో అభిమానించే వంగవీటి రంగా గురించి అందులో తప్పుడు సమాచారం ఉందని ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు.  ఈ నేపథ్యంలో రంగా తనయుడు రాధా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిని విచారించిన న్యాయస్థానం రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.  
Image result for vangaveeti ranga
మొదటి నుంచి సినిమా కథాంశం విషయంలో తాము అభ్యంతరం తెలిపామని, అయితే వాటిని పట్టించుకోకుండా ఆ సినిమాను అభ్యంతరకరంగా రూపొందించి విడుదల చేశారని, తమ ప్రతిష్టకు భంగం కల్పించారని వంగవీటి రాధ కోర్టుకు ఫిర్యాదు చేశారు.  వాస్తవానికి టైటిల్ ను ప్రకటించినప్పటి నుంచినే ‘వంగవీటి’ సినిమా వివాదాన్ని రేపింది. విజయవాడకు చెందిన వంగవీటి మోహన రంగ, అతడి సోదరుడు రాధా జీవితాల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా అప్పట్లో వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే.  
Image result for vangaveeti ranga
కాకపోతే ఈ సినిమా నిర్మాణ సమయంలో తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని వంగవీటి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఆ సమయంలో వర్మ తాను తీయదలచుకున్న సినిమాపై వారికి వివరణ కూడా ఇచ్చారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తమకు చెప్పినదానికి పూర్తి వ్యతిరేకంగా ఉందని రంగా కుటుంబ సభ్యుల ఆరోపణ.  
Image result for vangaveeti ranga
మొత్తానికి ఈ అంశంపై ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగినా అవేవీ ఒక కొలిక్కి రాలేదు..దీంతో రాధా కోర్టును ఆశ్రయించారు.  తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిద్దరినీ అరెస్టు చేయాలని ఆదేశించింది న్యాయస్థానం. 


మరింత సమాచారం తెలుసుకోండి: