తెలుగు, తమిళ, హిందీ, తమిళ ఇండస్ట్రీలోనే కాదు భారత దేశంలో స్టార్ హోదాల్లో ఉన్న నటుల్లో ఒకరు మళియాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.  తన కెరీర్ లో ఎన్నో అద్బుతమైన చిత్రాల్లో నటించిన మోహన్ లాల్ ఈ మద్య తెలుగు లో కూడా తన సత్తా చాటుతున్నారు.   ఈ మద్య మళియాళ బుల్లితెరపై కూడా మెరుస్తున్న మోహన్ లాల్ తాజాగా ఓ డ్యాన్స్ ఛాలెంజ్‌లో అందరికీ షాక్ ఇచ్చాడు.  

‘జిమ్మిక్కి కమ్మల్’ అనే సాంగ్‌లో తన జూనియర్లతో కలిసి స్టెప్పులేశాడు.  ఓ డ్యాన్స్ ప్రాక్టీస్ లో ఇద్దరు డ్యాన్సర్లు తమ డ్యాన్స్ గురించి మాట్లాడూ ఉండటం..తర్వాత మరో వ్యక్తి వారిని కన్వెన్స్ చేసి ఆ డ్యాన్స్ గ్రూప్ లోకి తీసుకు రావడం జరుగుతుంది.  ఇదే సమయంలో అకస్మాత్తుగా మోహన్ లాల్ ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇస్తాడు.  

తాను నటిస్తున్న ‘వెలి పడేంట్ పుస్తకం’ అనే చిత్రంలోని యాక్టర్స్ కొందరు కూడా ఈ డ్యాన్స్ ఛాలెంజ్‌లో పార్టిసిపేట్ చేశారు.  అయితే కాలేజీ స్టూడెంట్స్ నుంచి టెక్కీలవరకు అంతా ఈ డ్యాన్స్‌కు ఫిదా కావడం విశేషం. ఈ డ్యాన్స్ వీడియోను మోహన్‌లాల్ ఆదివారం పోస్ట్ చేయగా 40 లక్షలకు లైక్స్ వచ్చాయి..ఇంకా వస్తూనే ఉన్నాయి.  

జిమ్మిక్కి కమ్మల్ అంటే ఎర్నింగ్ మదర్ ( సంపాదిస్తున్న తల్లి) అని అర్థమట. ఈ పాట తనకెంతో ఇష్టమంటున్నాడు మోహన్‌లాల్.  మోహన్ లాల్ డ్యాన్స్ చేసిన వీడియో యూట్యూబ్‌లో వైరల్ అయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: