తెలుగు ఇండస్ట్రీలో అప్పటి వరకు మామూలు స్టార్ గా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి, బాహుబలి 2  చిత్రాలతో అనూహ్యంగా జాతీయ స్థాయి హీరో అయ్యాడు.  ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ప్రభాస్ కాదు బాహుబలి అంటున్నారు.  ఆ రేంజ్ లో క్రేజ్ దక్కించుకున్న బాహుబలి ప్రభాస్ ఈ సినిమా కోసం ఏకంగా ఐదు సంవత్సరాలు ఇతర సినిమాలకు కమిట్ కాకుండా ఎంతో డెడికేషన్ తో పూర్తి చేశాడు. 
Image result for baahubali 2
దీంతో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో ప్రభాస్ కి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. భారతీయ సినిమా చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో రూ. 1500 కోట్లకు పైగా కొల్లగొట్టిన సినిమాలో నటించిన హీరోకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంలో అతిశయోక్తి లేదు..కానీ ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత ఇందుకు ససేమిరా అంటున్నాడు.
Image result for baahubali 2 rajamouli
గతంలోకి వెళ్తే.. ‘బాహుబలి - ది కంక్లూజన్’ హిందీ మార్కెట్ పంపిణీ హక్కుల్ని ధర్మా ప్రొడక్షన్స్ ద్వారా కరణ్ జోహర్ సొంతం చేసుకున్నాడు. ఆ టైంలోనే ప్రభాస్‌ను తానే బాలీవుడ్‌కి పరిచయం చేస్తానని చెప్పాడు. అన్నట్టుగానే డార్లింగ్‌ని కదిపాడట. కానీ హిందీలో సినిమా చేసేందుకు ప్రభాస్ రూ. 20 కోట్లు అడిగాడట.
Image result for baahubali 2 karan johar
ఆ పారితోషికం కారణంగానే కరణ్ జోహార్ ప్రభాస్ ని వద్దని వరుణ్ ధావన్ తో ఈ సినిమా తీయడానికి సిద్దమవుతున్నట్టు ఆంగ్ల పత్రికల్ల్లో కథనాలు దర్శనమిచ్చాయి.

దక్షిణాది స్టార్స్ లో ఎవరికీ రజనీకాంత్ తో సహా బాలీవుడ్ లో అంత మార్కెట్ లేదని, అంత పారితోషికం ప్రభాస్ తో అస్సలు వర్కవుట్ కాదని అందుకే ప్రభాస్ ని కాదని బాలీవుడ్ యువ హీరోరుణ్ ధావన్ తో సినిమా కి మొగ్గు చూపుతున్నాడట.  అంతే కాకుండా కరణ్ ఓ ట్వీట్ చేశాడు. అది ప్రభాస్‌ను విమర్శిస్తూ చేసేందనని పలువురు అభిప్రాయపడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: