తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త హీరోయిన్ల జోరు బాగా పెరిగిపోయింది.   ఈ మద్య చాలా మంది హీరోయిన్లు మోడలింగ్ నుంచి వస్తున్నారు. ఇలా వచ్చిన వారిలో రకూల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి తదితరులు ఉన్నారు.  ఇక రకూల్ ప్రీత్ సింగ్ కి మాత్రం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరుస చాన్సులు రావడంతో ఈ అమ్మడు బిజీ హీరోయిన్ గా మారిపోయింది.  ఇక లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే...అందాల రాక్షసి చిత్రం యావరేజ్ గా నడిచింది. ఆ తర్వాత కూడా పెద్దగా చాన్సులు రాలేదు..కాకపోతే అక్కినేని నాగార్జున సూపర్ హిట్ చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంతో మంచి పేరు వచ్చింది.
Related image
కానీ ఇండస్ట్రీలో సినిమా చాన్సులు మాత్రం పెద్దగా రాలేదు.  తండ్రి కోరిక మేరకు చదువు పూర్తి చేసి తరువాత మోడలింగ్ లో, టీవీ కార్యక్రమాల్లోకి ప్రవేశించింది  2006 లో ఆమె మిస్ ఉత్తరాఖండ్ కిరీటం గెలుచుకున్నది.  మారుతి దర్శకత్వంలో నాని, లావణ్య త్రిపాఠి నటించిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 
Image result for soggade chinni nayana lavanya
కెరీర్ పరంగా పెద్దగా సక్సెస్ కాలేకపోతున్న ఈ అమ్మడు రిసెంట్ గా రామ్ హీరోగా నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ కూడా పాజిటీవ్ టాక్ తో నడుస్తుంది.  ఇన్ని విజయాలు వస్తున్నా..లావణ్య కన్నీటి కష్టాలు మాత్రం తప్పడం లేదు.   ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలో లావణ్య నటనకు ప్రేక్షకులు చిరాకు పడుతున్నారట.
Related image
ఆ సినిమాలో లావణ్య ఓవర్ మేకప్, నటన అస్సలు బాగాలేవంట. ఆ చిత్రంలోనే ఇంకో హీరోయిన్ అయిన అనుపమ తన నటనతో బాగానే ఆకట్టుకున్నా, లావణ్య నటన, గ్లామర్ మాత్రం పేలవంగా ఉన్నాయట. మరి ఈ సినిమా తరువాత లావణ్యకు అవకాశాలు రావడం చాలా కష్టమంటున్నారు విశ్లేషకులు. మరోవైపు  తెలుగులో విజయవంతమైన '100% లవ్' సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే, ఈ సినిమా చేస్తానని చెప్పిన లావణ్య త్రిపాఠి, కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.
Image result for bali bali magadivo lavanya
దీంతో లావణ్య వల్ల తాము చాలా నష్టపోయామని... రూ. 3 కోట్ల నష్టపరిహారాన్ని తమకు ఇప్పించాలని నిర్మాతలు అక్కడి కౌన్సిల్ ను కోరినట్టు, ఆ మేరకు ఆమెపై జరిమానా విధించినట్టు తమిళ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.  అసలే చాన్సులు రాక నానా ఇబ్బందులు పడుతున్న లావణ్య త్రిపాఠికి ఇది మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టేలా ఉందని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: