Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Jan 18, 2018 | Last Updated 3:27 pm IST

Menu &Sections

Search

లక్ష్మీస్ ఎన్టిఆర్ Vs లక్ష్మీస్ వీరగ్రంధం: ఇది ఎన్టిఆర్ సినిమాల సీజన్

లక్ష్మీస్ ఎన్టిఆర్ Vs లక్ష్మీస్ వీరగ్రంధం: ఇది ఎన్టిఆర్ సినిమాల సీజన్
లక్ష్మీస్ ఎన్టిఆర్ Vs లక్ష్మీస్ వీరగ్రంధం: ఇది ఎన్టిఆర్ సినిమాల సీజన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మన సినిమా పరిశ్రమలో సినిమా నిర్మాణం క్రేజ్ తోనే జరిగేలా ఉంది. మొదట ఏదో సందర్భంలో క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఆ "క్రేజ్ బేస్డ్ కాన్సెప్ట్" పై రాంగోపాల్ వర్మ సినిమా నిర్మాణం ప్రకటించటం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతానికి టాలీవుడ్ లో "మహనటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు" జీవితచరిత్ర ఆధారంగా "ఎన్టీఆర్ బయోపిక్" సినిమాల వరద మొదలై ఒక హవాగా నడుస్తోంది.

ntr-biopic-three-movies-at-a-time-vani-viswanath-r

తొలుత నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా "బాలయ్య-తేజా కాంబో" లో ఒక బయోపిక్ వస్తుందన్న విషయమూ తెలియ గానే, రామ్ గోపాల్ వర్మ దానికి పోటీగా వైసిపి నాయకుడు రాకేష్ రెడ్డి నిర్మాణత లో "లక్ష్మీ'స్ ఎన్టీఆర్" ప్రకటిస్తూ, సంచలనం రేపే "తొలి పోస్టర్ "  కూడా విడుదల చేసి పారేసి సినిమా నిర్మాణం ప్రారంభిస్తానని తెలిపిన సంగతీ తెలిసిందే. 

ntr-biopic-three-movies-at-a-time-vani-viswanath-r

మహనటుని ఎన్టీఆర్ పై సినిమా నిర్మాణాలపై అంతకంతకు పెరుగుతున్న సమయంలో దీని రూపురేఖలు మారే సంధర్భం చోటుచేసుకుంది. అప్పటి వరకూ సినిమా అంశంగానే ఉన్న ఈ బయోపిక్ ఎప్పుడైతే రామ్ గోపాల్ వర్మకి మద్దతుగా వైసిపి  ఉందన్న విషయం బయటికి వచ్చిందో, అప్పుడే సినిమా అంశం, రాజకీయ రంగు పులుము కుంది. 

ntr-biopic-three-movies-at-a-time-vani-viswanath-r

"లక్ష్మీ'స్ ఎన్టీఆర్" పోస్టర్ లో రాజకీయం గుర్తించిన టిడిపి సానుభూతి పరుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి  "లక్ష్మీస్ వీరగ్రంధం" సినిమాకి ముహూర్తం కూడా ఫిక్స్ చేసెసిమొన్న ఆదివారం రోజున ఎన్టీఆర్ ఘాట్ వద్ద  ముహూర్తపు షాట్ తీశారు. ‘లక్ష్మీస్ వీరగ్రంథం' చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకుని రెగ్యులర్ షూటింగ్‌కి రెడీ కాబోతుంది.

ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి క్లాప్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, '14 కోట్ల మంది ప్రియతమ నటుడు, నాయకుడు, లెజెండ్‌ నందమూరి తారకరామారావు చరిత్రను తెలియజేయడమే మా చిత్ర ప్రయత్నం. ఎన్టీఆర్‌ జీవితం మొదటి అధ్యాయాన్ని దర్శకుడు తేజ, చివరి అధ్యాయాన్ని రామ్‌గోపాల్‌ వర్మ సినిమా రూపంలో తెలుపుతుండగా, ఆయన జీవిత మధ్య అంకాన్ని మా చిత్రంలో చూపించబోతున్నాం. 


లక్ష్మీపార్వతి పాత్ర కోసం ఆ తర్వాత వాణీ విశ్వనాధ్ కూడా ఈ వార్తలు నిజమే అని తెలిపింది. ఆ పాత్రలో నటించడానికి రెడీగా ఉన్నానంటూ కూడా ఆమె తెలిపింది. కానీ లక్ష్మీపార్వతి పాత్ర కోసం దర్శకుడు కేతిరెడ్డి ఓ యంగ్ హీరోయిన్‌ని తీసుకోబోతున్నాడనే వార్తలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి.

ntr-biopic-three-movies-at-a-time-vani-viswanath-r


లక్ష్మీపార్వతి పాత్ర కోసం "కాటమరాయుడు, ఖైదీ నెంబర్ 150" చిత్రాలలో స్పెషల్ సాంగ్‌లలో నర్తించిన రాయ్ లక్ష్మీని "లక్ష్మీస్ వీరగ్రంథం" సినిమాలోని లక్ష్మీపార్వతి పాత్ర కోసం తీసుకున్నారని, ఈ పాత్రలో చేయడానికి ఆమె అంగీకారం తెలిపిందనే వార్తలు తాజాగా వ్యాపించాయి. "జూలీ 2" విడుదలకు సిద్ధం ప్రస్తుతం రాయ్ లక్ష్మీ నటించిన "జూలీ 2"  సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. మరి వినిపిస్తున్న వార్తలు నిజమే అయితే మాత్రం ఈ ప్రాజెక్ట్ మరింత సంచలనం కానుంది. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాలంటే మాత్రం కేతిరెడ్డి నుండి కబురు రావాల్సిందే.

ntr-biopic-three-movies-at-a-time-vani-viswanath-r

దీంతో లక్ష్మీ పార్వతి క్యాంపు లో కలకలం చెలరేగుతోంది దీనికి కారణం ఆ సినిమాకి సంబంధించి బయటికి వచ్చిన "తాజా పోస్టర్"   ఆ పోస్టర్ లో 'లక్ష్మీ'స్ ఎన్టీఆర్' లోని  లక్ష్మీ పార్వతి పాత్రని పోలిన ఒక మహిళ బెడ్ మీద ఉండగా ఆమె కాళ్ళ వైపు ఎన్టీఆర్ ఫోటో పెట్టి వుంది. తొలి రెండు పోస్టర్స్ లోనే లక్ష్మీ పార్వతిని ఎంత అవమానకర స్థాయిలో చూపించబోతున్నారో అర్ధం అయినప్పటికీ తాజా పోస్టర్ లో వేరే ఘాటు — మసాలా  ఘాటు ఇంకా పెరిగినట్టు అనిపించింది. 

ntr-biopic-three-movies-at-a-time-vani-viswanath-r

ఈ  సినిమా ముహూర్తం ముహూర్తం షాట్,  పోస్టర్ విడుదల  జరిగి పోయాక  "లక్ష్మీస్ వీరగ్రంధం" మీద లక్ష్మీ పార్వతి ఒక్కసారిగా అందులోని ఉద్దేశం అర్ధమైన తరవాత విరుచుకుపడడం ఖాయంగా అనిపిస్తోంది. అయితే కొందరు మిత్రులు లక్ష్మీపార్వతికి ఈ గండం నుంచి తప్పించుకోడానికి ఒక సలహా ఇచ్చారట. లక్ష్మీపార్వతి దాన్ని అనుసరించి అమలులో పెడితే “లక్ష్మీస్ ఎన్టీఆర్" ప్రకటించిన రామ్ గోపాల్ వర్మకి షాక్ తప్పదు. 

ntr-biopic-three-movies-at-a-time-vani-viswanath-r

ఒకప్పుడు "దారితప్పిన మేధావిగా" రామ్ గోపాల్ వర్మని అభివర్ణించిన లక్ష్మీపార్వతి వర్మ శిష్యుడు జె.డి. చక్రవర్తి వచ్చి అడగ్గానే "లక్ష్మీస్ ఎన్టీఆర్" కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాని కి ఒక్కటే కారణం వుంది.  అదే  టీడీపీ, చంద్రబాబు , ఎన్టీఆర్ కుటుంబాన్ని దెబ్బ తీయడమే ఆ సినిమా ఉద్దేశం.  తద్వారా వైసీపీకి లబ్ది చేకూర్చడం. అయితే లక్ష్మీ పార్వతి  ఈ ఆలోచనల్లో ఉండి ఒక సాంకేతిక విషయం మర్చిపోయారు. అదే  తమ ప్లాన్ కి ప్రత్యర్ధులు వ్యూహాత్మకంగా  కౌంటర్-ప్లాన్ వేస్తారని ఆమె గుర్తించలేకపోవటమే.
ntr-biopic-three-movies-at-a-time-vani-viswanath-r

"లక్ష్మీస్ వీరగ్రంధం" సినిమా ప్రకటన వచ్చాక గానీ ఆమెకి ఆ విషయం అర్ధం కాలేదు. ఈ నేపథ్యంలో లక్ష్మీపార్వతి మిత్రులు యిచ్చిన విలువైన సలహా ఏమిటంటే ఒకవేళ "లక్ష్మీస్ ఎన్టీఆర్" సినిమా ముందుకు వెళ్లకపోతే "లక్ష్మీస్ వీరగ్రంధం" ఆపమని అడగడానికి అవకాశం ఉంటుందని, ఈ విషయం మీద రాం గోపాల్ వర్మని ఒప్పిస్తే "లక్ష్మీస్ వీరగ్రంధం"  గండం నుంచి బయటపడొచ్చని అనుకుంటున్నారట. అంతకుముందు "లక్ష్మీస్ ఎన్టీఆర్" కి తల ఊపి ఇప్పుడు ఆ సినిమా ఆపమని ఆర్జీవి ని అడగడానికి లక్ష్మీపార్వతి సందేహ పడుతున్నారట. అయితే వీరగ్రంధం బయటకిరాకుండా ఉండాలంటే ఆ పని చేయక తప్పదు. మొత్తానికి ధైర్యాన్ని చిక్కబట్టుకొని  గుండె దిటవు చేసుకుని లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆపాలని వర్మ, నిర్మాత రాకేష్ రెడ్డి ని అడగడానికి లక్ష్మీపార్వతి సిద్ధం అవుతున్నారట.

ntr-biopic-three-movies-at-a-time-vani-viswanath-r

ఎన్టీఆర్ బయోపిక్ అదీ ఏక కాలంలో ఒకే సబ్జెక్ట్ మీద మూడు సినిమాలు రావటం కూడా ఇదే మొదటి సారేమో. ఒకదానికి ఎక్కువా ఒక దానికి తక్కువా అనికాదు ఎన్టీఆర్ జీవితం మీద వస్తున్న ఈ మూడు సినిమాలూ దేని కదే ప్రత్యేకం అన్నంత ఆసక్తిని క్రియేట్ చేసుకున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో మూడు  సినిమాలు తెరకెక్కబోతోన్న విషయం తెలిసిందే.  ఇన్ని సినిమాల రిలీజులూ, కలెక్షన్లూ, హిట్లూ, ఫట్లూ అన్నిటి మధ్య కూడా ఈ బయోపిక్ సినిమా మీద ఉన్న ఆసక్తి ఏమాత్రం తగ్గటం లేదు. 
ntr-biopic-three-movies-at-a-time-vani-viswanath-r
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author