ఒకనాటి గోల్డ్ లెగ్ హీరోయిన్ కాజల్ ఎవరికి అమ్మడి పొయింది అని ఆశ్చర్యపోతున్నారా..? అయితే ఈ టాపిక్ చదవండి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనువడు ఉధయనిది స్టాలిన్ కోలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్ హీరోల లిస్టు లోకి చేరుతున్నాడు. కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ హన్సిక తో ‘ఒకే ఒకే’ సినిమాలో నటించి, హన్సిక గ్లామర్ ను అడ్డంగా పెట్టుకొని మొదటి సినిమాకే మంచి మార్కులు వేయి౦చుకున్నాడు ఉధయనిది స్టాలిన్. ఈ సినిమా మన టాలీవుడ్ లో కూడా మంచి పేరే తెచ్చుకుంది. ఆ తరువాత సినిమాకు ఏకంగా నయనతార నే టార్గెట్ చేసి తన రెండవ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా కూడా మంచి పేరే తెచ్చుకుంది.

ఇలా క్రేజీ హీరోయిన్స్ ను తన సినిమాలకు కధానాయికలుగా పెట్టుకొని కోలీవుడ్ లో యంగ్ హీరో గా సెటిల్ అవడానికి ఉధయనిది ప్రయత్నిస్తున్నాడు. కాని ఉధయనిది కోలీవుడ్ సినిమా రంగంలో సెటిల్ అవడానికి ఎవరికీ తట్టని ఒక మాస్టర్ ప్లాన్ వేసుకుంటూ, తన కెరియర్ ను ముందుకు తిసుకువేళ్ళుతున్నాడు. ఇంతకీ ఆ ప్లాన్ ఏమిటంటే, కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ ను పట్టుకొని, వారికి ప్రస్తుతం ఉన్న మర్కెట్ రేట్ కన్నా రెట్టింపు పారితోషికంగా ఆఫర్ చేసి, ఆ బ్యూటీ ల డేట్స్ కొట్టేస్తాడు ఉధయనిది స్టాలిన్. ఇప్పుడు అదే మార్కెట్ ప్లాన్ కు మన ఉధయనిది కి కాజల్ చిక్కింది. ఈమధ్య నే చాలా దేశాలు తిరిగివచ్చిన కాజల్, తనకు ఎవరు పిలుస్తారా అని ఆలోచిస్తూ ఉంటే ఉధయనిది కాజల్ ను పట్టేసి తన కొత్త సినిమాకు హీరోయిన్ గా బుక్ చేసుకొని కోలీవుడ్ లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారాడు.

కోటి రూపాయలు పైన ఇస్తేగాని తెలుగులో సినిమాలు చెయ్యనని అవకాశాలు పోగొట్టుకున్న కాజల్ కు ఏకంగా కోటిన్నర  రూపాయల పారితోషికంగా ఇచ్చి ఆమె డేట్స్ అడిగాడట. ఇంకేముంది కాజల్ కోరుకున్న కోటి రూపాయలు వచ్చేశాయి కదా, వెంటనే ఉధయనిది తో రొమాన్స్ చెయ్యడానికి రెడీ చెప్పి అగ్రిమెంట్ పై సంతకాలు పెట్టేసిందట మన మగదీర సుందరి. మొత్తం మీద కోలీవుడ్ హీరో ఉధయనిది స్టాలిన్ రూపంలో కాజల్ కు మళ్ళి మంచి రోజులు వచ్చాయనే అనుకోవాలి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: