మంచు వారి కుటుంబ కధా చిత్రంలో హీరో మోహన్ బాబుతో పాటు ఆయన కుటుంబం అంతా నటిస్తోంది. మోహన్ బాబు సరసన హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ హీరోయిన్ రవీనా టండన్ నటిస్తోంది. తన సినిమాలలో నటించే నటీనటులకు క్రమశిక్షణ గురించి క్లాస్ పీకే మోహన్ బాబు ఇలా తన హీరోయిన్ రవీనా టండన్‌కు ఇలా ఫ్యాన్ పట్టి కూల్ చేస్తున్నాడు. ఈ సీన్ చూసి మోహన్ బాబు కొడుకు జుట్టు పీక్కుంటున్నాడు.

ఈ ఫన్నీ ఫోటో ప్రస్తుతం నెట్ లో అందరికీ కనువిందు చేస్తోంది. ఇంతకీ ఈ ఫోటోను పోస్ట్ చేసింది మరెవరో కాదు మోహన్ బాబు కూతురు లక్ష్మీప్రసన్న ఈ ఫోటోను తన ట్విటర్ లో పోస్ట్ చేసింది. మంచు కుటుంబం నిర్మిస్తున్న సినిమా ఫై  అందరి దృష్టి మళ్లించేందుకు, కావాలని లక్ష్మీప్రసన్న ఈ ఫోటోను పోస్ట్ చేసింది అనుకుంట. అనుకున్నట్టుగానే ఈ ఫోటోకు మంచి స్పందన నే వచ్చింది.  ఈ చిత్రంలో మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్‌లు ప్రధాన పాత్రలు చేస్తుండగా, వరుణ్ సందేష్, తనీష్ కూడా నటిస్తున్నారు. రవీనాటాండన్‌, హన్సిక, ప్రణీత హీరోయిన్స్. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో దాసరి ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా  బాలీవుడ్లో సంచలన విజయం నమోదు చేసిన గోల్ మాల్ 3కి రీమేక్ అని అంటున్నారు. ఇప్పటి వరకూ విష్ణు, మనోజ్, లక్ష్మీప్రసన్నల సినిమాల నిర్మాతగా బిజీగా ఉన్న మోహన్ బాబు చాలాకాలం తరువాత మళ్ళీ తన లోని నటుడుని మళ్ళీ తట్టి లేపుతున్నాడు మోహన్ బాబు. ప్రస్తుతం టాలీవుడ్ లో కుటుంబ సినిమాలకు క్రేజ్ పెరుగుతున్న పరిస్థుతులలో మోహన్ బాబుకు ఈ సినిమా ఎటువంటి హిట్ ఇస్తుందో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: