నూతన సంవత్సరం  ప్రారంభం అవగానే వచ్చే సంక్రాంతి తెలుగువారి పండుగలలో అతి ముఖ్య మైన పండుగ. ఈసంక్రాంతి అనగానే రంగు రంగుల ముగ్గులు గొబ్బెమ్మలు హారిదాసు కీర్తనలు పిండివంటలు కోడి పందాలు అన్ని గుర్తుకు వస్తాయి. వాటితో పాటుగా రంగురంగుల పతంగులు గాలిపటాలు లేని సంక్రాంతిని మనం అసలు ఉహించుకోలేము.

 

చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు సరదాగా గాలి పటాలు ఎగుర వేయటమనేది  ఈ సంక్రాంతి కాలంలో సర్వ సాధరణంగా కనిపించే విషయం. గాలి పటాలు  ఎగుర వేసే ఆచారం వెనుక ఒక ఆంతర్యం ఉంది.  సూర్యుడు మకర రాశితో సంక్రమణం చేయడాన్ని మకర సంక్రాంతి అంటారు అన్న విషయం తెలిసిందే. ఈకాలంలో రోజులో పగటి పూట సమయం ఎక్కవగాను రాత్రి సమయం తక్కవుగాను ఉంటుంది. ఈ రోజు నుండి చలికాలం తగ్గి వేసవి ప్రారంభమవుతు ఉంటుంది.

 SANKRANTI KITES PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇకపోతే ఈ కాలంలో గాలిపటాలు ఎగురవేయడం వెనుక ఉన్న రహాస్యం ఏమిటంటే పూర్వకాలంలో గాలిపటాలను ఉదయం గాని సాయంత్రంగాని ఎగురవేసే వాళ్లు ఈ టైంలో సూర్యరశ్మి మన శరీరానికి తగటం వల్ల విటమిన్ డి అనేది పుష్కలంగా లభిస్తుంది. ఇది శారీరక పెరుగుదలకు ఎంతో అవసరం అన్న ఉద్దేశంతో ఈ గాలిపటాల ఆచారం మొదలు అయింది అని అంటారు.

SANKRANTI KITES PHOTOS కోసం చిత్ర ఫలితం 

అంతేకాదు గాలిపటాలు ఎగురవేయటం వలన మానసిక ప్రశాంతత కూడ లభిస్తుంది. రంగురంగుల అందమైన  గాలిపటాలు ఆకాసంలో ఎగురుతూ ఉంటే మబ్బులను తాకాలని ప్రయత్నించే గాలిపటాల వేడుక చూడముచ్చటగా ఉంటుంది. గాలిపటం ఎంత ఎత్తుకు ఎగిరితే సూర్య భగవానుడు కరుణ మన పై అంతగా ఉంటుందని పెద్దల నమ్మకం. ఈ గాలిపటాలు ఎగురవేసే కార్యక్రమాన్ని ‘పతంగ్’ ఫెస్టివల్ గా చాల చోట్ల అనేక ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయి..  

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: