‘అజ్ఞాతవాసి’  ఫలితం పూర్తిగా తెలిసిపోవడంతో ఈసినిమాకు కొనుక్కున్న బయ్యర్లతో పాటు ఈసినిమాకు దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ కూడ ఇంకా షాక్ నుండి తేరుకోవడంలేదు అని వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈసినిమా ఫలితం త్రివిక్రమ్ త్వరలో దర్శకత్వం వహించబోయే  జూనియర్ వెంకటేష్ ల మూవీ ప్రాజెక్ట్స్ పై ఉండబోతోంది అంటూ గాసిప్పులు మొదలయ్యాయి. దీనితో  వెంకీ ఎన్టీఆర్ లు తమ సినిమాలకు సంబంధించి ‘అజ్ఞాతవాస’ ఫలితం రీత్యా ముందుగానే జాగ్రత్త పడుతున్నాడు అనే వార్తల హడావిడి మరింత గందరగోళంలోకి పడేస్తోంది. 
TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇది ఇలా ఉండగా విక్టరీ వెంకటేష్ నేరుగా ‘అజ్ఞాతవాసి’ నిర్మాత రాధాకృష్ణ కు అదేవిధంగా త్రివిక్రమ్ కు ఫోన్ చేసి జయాపజయాలు కామన్ ఇవన్నీ లైట్  తీసుకుని తరువాత ప్రాజెక్టు మీద దృష్టి పెట్టండి అని చెప్పినట్లు తెలిసింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేరుగా త్రివిక్రమ్ కు ఫోన్ చేసి ‘మనం ఖచ్చితంగా హిట్ కొడతాం మీరు బౌన్స్ బ్యాక్ అవుతారు డోంట్ వర్రీ’ అని చెప్పినట్లు టాక్. 
TRIVIKRAM ALONG WITH VENKATESH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనితో ‘అజ్ఞాతవాసి’ విడుదల తరువాత జూనియర్ త్రివిక్రమ్ ల మూవీల పై ప్రచారంలోకి వచ్చిన గాసిప్పులకు ఒక క్లారిటీ వచ్చింది అనుకోవాలి. ఇప్పటికే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేసే మూవీకి  సంబంధించి మంచి స్క్రిప్ట్ తయారుచేసాడు అని వార్తలు ఉన్నాయి.  


ఇది పూర్తిగా లవ్ అండ్ ఫ్యామిలీ సబ్జెక్ట్ అని టాక్. ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ పవన్ ఇమేజ్ పై కన్నా  త్రివిక్రమ్ ఇమేజ్ పై తీవ్రప్రభావాన్ని చూపెడుతుంది అని కామెంట్స్ వచ్చిన నేపధ్యంలో జూనియర్ వెంకటేష్ లు త్రివిక్రమ్ కు ఇచ్చిన మానసిక ధైర్యం రానున్న రోజులలో ఈమాటల మాంత్రికుడి చేత అద్భుతాలు చేయించే ఆస్కారం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: