తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాన్. ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ రేంజ్ మాస్ ఇమేజ్ సంపాదించిన హీరో పవన్ కళ్యాన్.  అన్నయ్య బాటలోనే నడుస్తూ..రాజకీయాల్లో కూడా తనదైన ప్రతిభ కనబరుస్తున్నారు పవన్.  జనసేన పార్టీ స్థాపించి వారి తరుపు నుంచి పోరాడుతున్నారు.  ఓ వైపు సినిమాలు..మరో వైపు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు పవన్ కళ్యాన్.  తాజాగా పవన్ కళ్యాన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం మొన్న రిలీజ్ అయ్యింది. 
Image result for agnatavasi movie stills
ఈ సినిమాపై మొదటి రోజు నుంచి మిశ్రమ స్పందన వస్తుంది.  కానీ కలెక్షన్ల పరంగా మాత్రం సునామీ సృష్టిస్తుంది.  అయితే ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో వెంకటేష్ నాలుగు నిమిషాల పాటు ఉంటాడని మొదటి నుంచి టాక్ వినిపిస్తుంది. అంతే కాదు సినిమా పడే ముందు వెంకటేశ్ కి కృతజ్ఞతలు తెలపడంతో నిజంగా వెంకటేష్ ఉన్నాడని అభిమానులు ఎంతోగానో అశిస్తే..సినిమా చివరి వరకు కనిపించలేదు. 

దీంతో అభిమానులు బాగా నిరాశ పడ్డారు. కాకపోతే సినిమాలో వెంకటేష్ పాత్ర ఉందని..త్వరలో యాడ్ చేస్తామని చిత్రయూనిట్ తెలుపుతున్నారు.  తాజాగా వెంకటేష్  సీన్‌ను కలిపేందుకు అజ్ఞాతవాసి మేకర్లు డిసైడ్‌ అయ్యారు. ఈ మేరకు ఓ మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. వెంకీ-పవన్‌ మధ్య నడిచే అ సన్నివేశం కోసం ఇద్దరు స్టార్లు కలిసి డబ్బింగ్‌ చెప్పటం ఆ వీడియోలో ఉంది.   

పవన్‌.. గురువు గారు అంటే.. గారు అక్కర్లేదమ్మా గురూ చాలూ.. అని వెంకీ చెప్పటం... ‘నాకు కొంచెం తిక్కుంది’ అని పవన్‌ అంటే... ‘దానికో లెక్కుంది’ అని మళ్లీ వెంకీ చెప్పటం ఇలా సాగిపోయిన వీడియో ఫన్నీగా ఉంది.  సంక్రాంతి నుంచి ఆ సీన్‌ చిత్రానికి యాడ్‌ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: