ఎప్పుడూ లేనివిధంగా ఈ సంక్రాంతి రేసుకు వచ్చిన పెద్ద హీరోల సినిమాలు అన్నీ డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సంవత్సరం సంక్రాంతి రేస్ విన్నర్ గా ఏ టాప్ హీరో నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. పవన్ బాలకృష్ణల అభిమానులకు కూడ వారు నటించిన సంక్రాంతి రేస్ సినిమాలు నచ్చని నేపధ్యంలో సంక్రాంతి తరువాత ఈ ఇద్దరి టాప్ హీరోల సినిమాలకు ఆశలు ప్రేక్షకులనేవారు ఉంటారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

దీనితో ప్రస్తుతం అందరి దృష్టి ఎవరూ ఊహించని విధంగా రేపు విడుదల కాబోతున్న రాజ్ తరుణ్ ‘రంగుల రాట్నం’ పై పడింది. నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ కేవలం 5 కోట్ల పెట్టుబడితో పూర్తి అయింది.

 RANGULARATNAM MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

పెద్ద సినిమాల హడావిడి మధ్య ఈసినిమాను ఎవరూ పట్టించుకోకపోవడంతో నాగార్జున తానే సొంతంగా ఈమూవీ రిలీజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ మార్కెట్ ఐదు కోట్లు మించి లేని నేపధ్యంలో యూత్ ఎంటర్ టైనర్ గా విడుదల అవుతున్న ఈమూవీకి యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడ బాగా కనెక్ట్ అవుతారు అన్న ప్రచారం జరుగుతోంది.

 

‘అజ్ఞాతవాసి’ ‘జై సింహా’ ‘గ్యాంగ్’ ఇలా ఈమూడు సినిమాలు ప్రేక్షకులకు నచ్చని సినిమాలుగా మారిన నేపధ్యంలో రాజ్ తరుణ్ కు ఈ సంక్రాంతి ఊహించని బ్రేక్ ఇవ్వబోతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం పండుగ రోజులలో సినిమాలు చూడాలి అన్నా మంచి సినిమాలు లేని నేపధ్యంలో ఆలోటును ‘రంగుల రాట్నం’ పూడ్చగలిగితే రాజ్ తరుణ్ సంక్రాంతి రేస్ హీరోగా మారడమే కాకుండా తిరిగి అతడి కెరియర్ టర్న్ అయ్యే ఆస్కారం ఉంది. ఈసినిమా కూడ ప్రేక్షులకు నచ్చకపోతే సంక్రాంతి రేసుకు వచ్చిన అన్ని సినిమాలను ప్రేక్షకులు రిజెక్ట్ చేసిన సంక్రాంతి గా  ఈ పెద్ద పండుగ  మరో కొత్త రికార్డును క్రియేట్ చేయబోతోంది అనుకోవాలి..



 


మరింత సమాచారం తెలుసుకోండి: