‘అజ్ఞాతవాసి’ సూపర్ హిట్ అయితే దాదాపు సినిమాలు మానేయాలని నిశ్చయించుకున్న పవన్ ఆలోచనలను ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్ పూర్తిగా మార్చివేసింది అని తెలుస్తోంది. తాను నటించే సినిమాల జయాపజయాలను ఏమాత్రం పట్టించుకోని పవన్ ను సైతం ‘అజ్ఞాతవాసి’ రిజల్ట్ కదిలించి వేసింది అని అంటున్నారు. దీనితో ‘అజ్ఞాతవాసి’ ఎఫెక్ట్  తరువాత పవన్ తన సినిమాల కు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అన్న ఆశక్తి ఇప్పడు ఇండస్ట్రీ వర్గాలలో ఉంది. ‘అజ్ఞాతవాసి’ వల్ల నష్టపోయిన బయ్యర్ల కోసం పవన్ మరో మూవీ స్టార్ట్ చేస్తాడా లేక ‘జనసేన’ వైపు మొగ్గు చూపుతాడా అనేది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నగా మారింది.

 PAWAN KALYAN LATEST PHOTOS IN AGNATHAVASI MOVIE కోసం చిత్ర ఫలితం

వాస్తవానికి ఎన్నికల లోపు పవన్ మరో సినిమా చేస్తాడనే టాక్ బలంగా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. తన నెక్ట్స్ సినిమాకు సంబంధించి కాల్షీట్లు కేటాయించేంత టైమ్ పవన్ వద్ద ఉంది. అయితే పవన్ సినిమా మొదలుపెట్టక వేగంగా పూర్తి చేయడు అన్న కామెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పటికే మైత్రీ మూవీస్ సంస్థ పవన్ తో సినిమాను చేయడానికి సిద్దంగాఉన్నారు. దీనితో పవన్ ఈ బ్యానర్ లో పవన్ సినిమా చేస్తాడా లేక ఇంతకు ముందే కమిటైన ఏఎం రత్నంకే సినిమా చేస్తాడా? అనే విషయం పవన్ కే సమాధానం లేని ప్రశ్నగా మారింది అని అంటున్నారు.

సంబంధిత చిత్రం 

ఇది ఇలా ఉండగా ‘అజ్ఞాతవాసి’ తో పాతిక సినిమాలు పూర్తిచేసిన పవన్ ప్రస్తుతానికి సినిమాలు ఆపుచేసి రాజకీయాలపై పూర్తిగా దృష్టిపెట్టిన తర్వాత 2020 నుంచి మళ్లీ సినిమాలు చేస్తాడనే వాదన కూడా వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో నేరుగా కొన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తామని పవన్ ప్రకటించిన నేపధ్యంలో ఇప్పట్నుంచే ‘జనసే’న పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయకుండా అశ్రద్ధ వహిస్తే పొలిటికల్ గా పవన్ కు కోలుకోలేని నష్టం కలగొచ్చుఅన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రస్తుతం పవన్ ఎవరికీ అందుబాటులో లేకుండా తన మౌన  అజ్ఞాతవాసాన్ని కొనసాగిస్తున్నాడు.


సినిమాలు ఆపేస్తానని ఒకసారి కొనసాగిస్తానని మరోసారి ఇలా గజిబిజి ప్రకటనలు చేస్తూ పవన్ తానూ కన్ఫ్యూజ్ అవుతూ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తునాడు అనే కామెంట్స్ వస్తున్నాయి. దీనికితోడు రాబోతున్నది ఎన్నికల కాలంకాబట్టి తన రాజకీయాలకు అదేవిధంగా తన ‘జనసేన’ కు తన దగ్గర డబ్బు లేదు అంటూ మరో సినిమాను ఎవరో ఒక దర్శకుడితో అనాలోచితంగా పవన్ మొదలుపెట్టినా ఆశ్చర్యంలేదు అని అంటున్నారు. అందుకే ఈ అజ్ఞా వాసి తీరు ఎవ్వరికీ అర్ధంకాదు అంటూ చాలామంది జోక్ చేస్తూ ఉంటారు..  

 


మరింత సమాచారం తెలుసుకోండి: