గత రెండు ఏళ్లగా సంక్రాతి రేస్ హీరో గా ప్రశంసలు అందుకున్న శర్వానంద్ ఈ ఏడాది సంక్రాతి రేస్ కు మరో సినిమాను రెడీ చేయకుండా పెద్ద పొరపాటు చేసాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈమధ్య శర్వానంద్ ఎక్కడ కనిపించినా తలపై టోపీతోనే కనిపిస్తున్నాడు. ఇలా హ్యాట్ ధరించడం ఇతడికి కొత్త కాకపోయినా అసలు టోపీ లేకుండా ఎక్కడకు బయటకు రాకపోవడాన్ని పసిగట్టిన కొందరికి కొన్ని అనుమానాలు కలిగాయి.

 SHARWANAND LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

దీనితో శర్వానంద్ టోపీ వెనక ఏదో సీక్రెట్ దాగిఉంది అంటూ కామెంట్స్ మొదలు అయ్యాయి. ఇప్పుడు అదే నిజమని అంటున్నారు అతడి  సన్నిహితులు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు శర్వా. హీరోయిన్ సాయి పల్లవి డేట్స్ ప్రాబ్లెం కారణంగా ముందుగా ఆమెతో ఉన్న సన్నివేశాలను పూర్తి చేస్తున్నారు. కానీ సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ ఒక మూవీ చేయాల్సి ఉంది.

 SHARWANAND LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇప్పుడు శర్వా టోపీకి సుధీర్ వర్మ సినిమాకు ఒక కనెక్షన్ ఉందనే ప్రచారామ్  జరుగుతోంది. ఈమూవీలో శర్వానంద్ డ్యుయల్ రోల్స్ పోషిస్తాడట. అందులో ఒక రోల్ లో వయసు పైబడిన పాత్రలో కనిపించాల్సి ఉంటుందని తెలుస్తోంది. అందుకే తల నెరిసినట్లుగా కనిపించే లుక్ కోసం శర్వా కొన్నిరోజులుగా ప్రయత్నిస్తున్నాడని టాక్. 
SHARWANAND LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

అంతేకాదు మొహం పై ముడతలు కూడా ఉండే విధంగా శర్వానంద్ లుక్ ఉంటుందని తెలుస్తోంది. శర్వా చేసిన ఈ మేకోవర్ ప్రేక్షకులకు షాక్ కు గురి చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇదే సినిమాలో మరో పాత్రలో అచ్చమైన సిటీ కుర్రాడిగా ఫుల్ గ్లామర్ తో కనిపించబోతున్నాడు శర్వానంద్. ఈమూవీ పై ఈ యంగ్ హీరోకు చాల ఆశలు ఉండటంతో ఈ మూవీ లుక్ కోసం శర్వానంద్ ఈవిధంగా కష్టపడుతున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: