రామ్ గోపాల్ వర్మ నాగార్జునల కాంబినేషన్ లో ఒకసినిమా కొద్దినెలల క్రితం ప్రారంభం అయినప్పుడు చాలామంది నాగార్జున ఈప్రయోగానికి ఎలా ఒప్పుకున్నాడు అంటూ ఆశ్చర్య పోయారు. ఈ మూవీ ఫంక్షన్ లో నాగ్ మాట్లాడుతూ వర్మ గత కొన్నేళ్లుగా తలాతోకా లేని సినిమాలు చేస్తూ ఒకేసారి ఎక్కువ సినిమాలు నెత్తికెత్తుకోవడం వల్ల దారి తప్పాడని తనతో సినిమా చేస్తున్నపుడు ఇలా వేరే కమిట్మెంట్లేవీ పెట్టుకోకుండా పూర్తిగా తన సినిమా మీదే ఫోకస్ పెడతాను అని వర్మ తనకు మాట ఇవ్వడం వల్ల తాను ఈసినిమాను చేస్తున్నాను అంటూ అందరి సందేహాలను తీర్చాడు నాగ్. 
RAMGOPAL VARMA ALONG WITH NAGARJUNA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇది జరిగిన కొంతకాలం వరకు  వర్మ కూడా సిన్సియర్ గా కనిపిస్తూ  అప్పటికే తాను అనౌన్స్ చేసిన ప్రాజెక్టుల ఊసెత్తకుండా సైలెంటుగా ఉన్నాడు. అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటుండగా ఇప్పుడు వర్మ మళ్లీ పాత స్టయిల్లోకి మారిపోయాడు. కొన్ని రోజుల కిందటే ‘కడప’ పేరుతో ఒక వివాదాస్పద వెబ్ సిరీస్ ప్రకటించాడు. దీనితరువాత  ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ పేరుతో ఒక అమెరికన్ పోర్న్ స్టార్ తో షార్ట్ ఫిలిం తీస్తున్నాడు. 
RAMGOPAL VARMA ALONG WITH NAGARJUNA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈషార్ట్ ఫిలింనిండా బూతులే ఉంటాయని తెలుస్తోంది.    ముఖ్యంగా వర్మ తీస్తున్న ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ కు సంబంధించిన విషయాలు నాగార్జున  అభిమానులు ఎవరికీ రుచించడం లేదు. ఒకవైపు నాగార్జునతో సినిమా చేస్తూ ఇదేంటని నాగ్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా నాగార్జునకు కుటుంబ ప్రేక్షకుల్లో మహిళల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. మరి నాగ్ ఇలా పోర్న్ స్టార్ తో కలిసి నగ్న వీడియోలు తీసే వివాదాల దర్శకుడు వర్మ దర్శకత్వంలో నటించడం నాగ్ ఇమేజ్ కి ఏమాత్రం మంచిది కాదు అన్న అభిప్రాయాలను అభిమానులు వ్యక్త పరుస్తున్నారు.  
RAMGOPAL VARMA ALONG WITH NAGARJUNA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనికితోడు వర్మ ప్రస్తుతం చేస్తున్న వివాదాస్పద మైన వెబ్ సిరీస్ వ్యహారాలు నాగార్జున సినిమాల మీద ప్రభావం ఖచ్చితంగా చూపెడతాయి అన్నది నాగ్ అభిమానుల అభిప్రాయం. దీనికితోడు వెబ్‌ సిరీస్‌ లంటూ వర్మ దృష్టి అంతా ఈ బూతుల వ్యహారం మల్లి పోవడంతో ? నాగార్జునతో సినిమా అనేసరికి పూర్వపు వర్మ తిరిగి వస్తాడనే నాగ్ అభిమానుల ఆశలు ఆవిరిఅయిపోవడమే కాకుండా వర్మ వల్ల లేని పోనీ అపఖ్యాతిని నాగార్జున పొందవలసి వస్తుంది అంటూ అభిమానులు తమ అభిప్రాయాలను నాగ్ దృష్టికి తీసుకు వస్తున్నట్లు టాక్. మరి రెచ్చి పోతున్న వర్మ స్పీడ్ కు నాగ్ ఎలా చెక్ పెడతాడో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: