త‌మిళ‌స్టార్ హీరో సూర్యకు త‌మిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ ఉంది. సూర్య‌ న‌టించిన గ్యాంగ్ సినిమా అత‌డి త‌మిళ సినిమాల‌కు స‌మానంగా తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. పొంగ‌ల్‌కు రావ‌డంతో పాటు ఇక్క‌డ యూవీ క్రియేష‌న్స్ వారు, స్టూడియో గ్రీన్ వారు సంయుక్తంగా గ్యాంగ్ రిలీజ్ చేశారు. సూర్య - కీర్తి సురేష్ కాంబినేష‌న్ కావ‌డంతో ఇక్క‌డ కూడా మంచి హైప్ వ‌చ్చింది.

Image result for surya gang movie stills

ఆల్రెడీ బాలీవుడ్‌లో హిట్ అయిన సినిమాను త‌మిళ్ నేటివిటీకి అనుగుణంగా డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్ మార్పులు, చేర్పులు చేశారు. టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఆస‌క్తిగా ఉండ‌డంతో పాటు పాజిటివ్ రివ్యూలు రావ‌డంతో సినిమాకు తొలి రోజు మంచి ఓపెనింగ్స్ వ‌స్తాయ‌ని అంద‌రూ ఆశించారు. అయితే తొలి రోజు గ్యాంగ్‌కు తెలుగులో డిజాస్ట‌ర్ ఓపెనింగ్స్ వ‌చ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాంగ్ కోటి రూపాయ‌ల షేర్ కూడా రాబ‌ట్ట‌లేదు. కేవ‌లం రూ.86 ల‌క్ష‌ల‌తో స‌రిపెట్టేసింది. 

Image result for surya gang movie stills

గ్యాంగ్‌ ఫ‌స్ట్ డే ఏరియా వైజ్ షేర్ : (రూ.ల‌క్ష‌ల్లో)
నైజాం - 0.27
సీడెడ్ - 0.15
వైజాగ్ - 0.13
గుంటూరు - 0.10
కృష్ణా - 0.6
ఈస్ట్ - 0.7
వెస్ట్ - 0.4
నెల్లూరు - 0.4
---------------------------------------------------
ఫ‌స్ట్ డే ఏపీ+తెలంగాణ‌ షేర్ = 86 ల‌క్ష‌లు
---------------------------------------------------




మరింత సమాచారం తెలుసుకోండి: