తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమ అంటే రెండు రాష్ట్రాల ప్రజలకే కాదు ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం ఎంతగానో అభిమానిస్తారు.  వాస్తవానికి కేరళ కుట్టి అయిన సుమ తెలుగు ఎంతో చక్కగా మాట్లాడి అందరినీ మెప్పిస్తుంది.  బుల్లితెరపై ఎన్నో ప్రోగ్రామ్స్ లో యాంకరింగ్ చేసిన సుమ తెలుగు లో పెద్ద సినిమాల ఆడియో వేడుకలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ..సందడి చేస్తుంది. 
Image result for యాంకర్ సుమ
ఇండస్ట్రీలో సుమకు తెలుగు సినిమాపై మంచి పట్టు ఉండటంతో ఆమెకే ఎక్కువగా యాంకరింగ్ కి  చాన్స్ ఇస్తుంటారు చిత్ర యూనిట్.  తెలుగు బుల్లితెర, వెండి తెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకుంది సుమ.  బుల్లితెరపై తన యాంకరింగ్‌తో నవ్వులు పూయించే సుమ కనకాల.. ఇంట్లో కూడా చాలా సరదాగా ఉంటుంది. ఆమె టీవీలో కనిపిస్తే చాలు.. ఆ కార్యక్రమం అరగంటైనా గంటైనా సమయం తెలియకుండానే గడిచిపోతుంది.
Image result for యాంకర్ సుమ
అందుకే, వయస్సు బేధం లేకుండా అంతా ఆమెను అభిమానిస్తారు. టీవీపై పంచులు, జోకులతో అలరించే సుమ.. ఇంట్లోనూ అలాగే ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతుంటారు.  తాజాగా యాంకర్ సుమ సంక్రాంతి పండుగ సందర్భంగా మేకప్ లేకుండా, జుట్టు విరబూసుకుని, కిచెన్‌లో నేలపై కూర్చొని సీరియస్‌గా పులిహార కలిపేస్తున్న సుమ.. తన అభిమానులను పలకరిస్తూ.. ‘‘చింతపండుతో పులిహోర చేస్తున్నాను.
Image result for యాంకర్ సుమ
ఇదిగో చింతపండు గుజ్జు. ఇదిగో పులిహోర. ఎవరైనా వస్తున్నారా పులిహోర టేస్ట్ చేయడానికి..’’ అంటూ చిరునవ్వులు చిందించింది. తాను పులిహోరతో పాటు మరెన్నో చేస్తున్నానని, మీరందరూ ఈ రోజు ఏం చేస్తున్నారని సుమ అడిగింది. చివరికి హ్యాపీ సంక్రాంతి అంటూ అప్యాయంగా పలుకరించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: