తెలుగు వారికి పండుగలు అంటే..ముఖ్యంగా దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు అంటే ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకుంటారు.  ఇక పెళ్లైన కొత్త జంటల హంగామా మామూలుగా ఉండదు.  కొత్త అల్లుడిని ఇంటికి ఆహ్వానించి ఎంతో మర్యాదలు జరుపుతారు. ఎవరి స్థాయిని బట్టి వారు తమ అల్లుళ్లకు ఏ లోటూ రాకుండా చూసుకుంటారు.  అత్తారింటిలో వండిన పిండి వంటలు బాగా ఆరగించి.. అత్తింటివారిచ్చని పండు కానుకలతో ఎంతో సంతోషంగా తిరిగి వెళ్తారు.  ఇది సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరుకు సాగే తంతు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన చిన్నల్లుడికి పండుగ ఆతిథ్యమిచ్చారు. ఈ సంక్రాంతిని చిన్నల్లుడితో కలసి ఆనందంగా జరుపుకున్నారు. గత సంవత్సరం ఖైదీ నెంబర్ 150 తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన 151 వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ బిజీలో ఉన్నారు.  అంతే కాదు ఈ సినిమా కోసం మొన్నటి వరకు గుబురు గడ్డం..మీసం తో కనిపించిన చిరంజీవి ఇప్పుడు మీసం లేకుండా కనిపిస్తున్నారు..ఇది కూడా సినిమా కోసమేనట.
Image result for srija kalyan
ఇక చిన్నల్లుడు కళ్యాన్ తో చిరు ఫ్యామిలీ హ్యాపీగా ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తుంది. చిరంజీవి తన అల్లుడి భుజంపై చేసి వేసి...నల్ల కళ్లద్దాలు పెట్టుకొని సాంప్రదాయంగా పట్టుపంచె, షర్టు ధరించి స్టైలిష్ లుక్ ఇచ్చారు.  చిరు పక్కన చిన్నల్లుడు కళ్యాణ్ బ్లూషర్ట్, జీన్స్ వేసుకుని చిరునవ్వుతో నిలుచున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Image result for srija kalyan
ఇదిలా ఉంటే కళ్యాణ్ త్వరలో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఆయన హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. కళ్యాణ్‌ పక్కన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: