సంచలనానికి పర్యాయపదం రాంగోపాల్ వర్మ. సినిమా పరిశ్రమలో ప్రతి చిన్న విషయానికి తనదైన స్టైల్లో స్పందిస్తూ ఎన్నో సంచలనాలు రేపారు వర్మ.  ఆయన ఏం తీసినా సంచలనమే.. ఏం మాట్లాడినా సంచలనమే. ఓ వైపు సినిమాలు తీస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్నారు. ఆ మద్య ‘కడప’ సీరిస్ తీస్తానని చెప్పి ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.  తాజాగా గాడ్, సెక్స్ అండ్ ట్రూత్‌ (జీఎస్టీ)తో సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాడు జీఎస్టీ సినిమా కాదు. ఓ షార్ట్ ఫిలిం కాదు. అలా అని వెబ్ సిరీస్ కూడా కాదు. కేవలం అది సెక్స్ గురించి, ఆమెకు ఆ విషయం ఎంత ముఖ్యమో పోర్న్‌స్టార్ మియా మల్కోవా చెప్పే అనుభూతులు మాత్రమే అని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు. 

అద్భుతమైన మాల్కోవా దేహాన్ని

ఈ మేరకు ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ ట్రైలర్‌ను ఈరోజు (జనవరి 16న) వర్మ విడుదల చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు అందించారు. ట్రైలర్‌తో పాటు వర్మ తెలుగులో వాయిస్ ఓవర్ ఇస్తూ మరో వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ మొత్తం వీడియో రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నట్లు వర్మ చెప్పారు. మియా మాల్కోవా అధికారిక విమియో ఛానెల్‌లో ఈ వీడియో అందుబాటులో ఉంటుందని చెప్పారు.  

 యూరప్‌లో గాడ్, సెక్స్ అండ్ ట్రూత్

అద్భుతమైన మాల్కోవా దేహాన్ని పట్టేయడానికి కెమెరా నోచుకొని పుట్టింది. ఆమె ప్రతీ ఆలోచన సరళిని కెమెరా ఒడిసిపట్టుకొన్నది. ఆమె శరీర సౌందర్యంలో దాగి ఉన్న ప్రతీ సెక్సువల్ ఎమోషన్స్ అద్బుతంగా చూపించింది అని వర్మ పేర్కొన్నారు.మాల్కోవా షాకింగ్ కలిగించే విధంగా శృంగార భరితమైన పదాలను లయబద్ధంగా మాట్లాడుతుంది. ప్రజలను సంప్రదాయకంగా ఆకట్టుకునే ప్రయత్నం దిశగా ఈ వీడియోను చిత్రీకరించాం అని ఆర్జీవి వెల్లడించారు వర్మ.   

 మాల్కోవాను గౌరవిస్తా

ఒక అమ్మాయి నగ్న సౌందర్యాన్ని ఎంత అందంగా చూపించవచ్చనే విషయాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని యూరప్ వెళ్లి ఈ ప్రయత్నం చేసినట్లు వివరించారు. ఇంకా చాలా విషయాలను తన వీడియోలో వర్మ చెప్పారు. తన నచ్చిన విధంగా జీవించడానికి మియా మాల్కోవా తీసుకొన్న నిర్ణయం, తన ఇష్టం వచ్చిన విధంగా సెక్స్‌ను అనుభవించాలనే ఆమె కోరికను నేను చాలా గౌరవిస్తాను. సిగ్గు, బిడియం, సమాజ కట్టుబాట్లను ఎదిరించి శ‌ృంగారానికి గౌరవం కల్పించింది అని వర్మ అన్నారు. 


మరోవైపు సెక్స్  విషయం గురించి ఏళ్ళతరబడి రీసెర్స్ చేసినవారికి కూడా రానంత పేరు ఇప్పుడు వర్మ ఇలా పోర్న్ స్టార్ తో పోర్న్ ను సపోర్టు చేస్తూ తీసిన వీడియోతో రావచ్చు. కాని ఈ తరహా డాక్యుమెంటరీలు పరిశోధనలూ వీడియోలు.. ఇప్పటికి కొన్ని వందలు వచ్చాయి. హాలీవుడ్ మరియు వరల్డ్ సినిమా చూసేవారికి ఇది అస్సలు కొత్తగా అనిపించదు.  అందమైన మహిళ మానసిక పరిపక్వతతో మరో కొత్త శృంగార ప్రపంచాన్ని సృష్టించడానికి చేసిన ప్రయత్నం ఇది అంటున్నారు వర్మ. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: