స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాచేయడానికి ఎందరో దర్శకులు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం బన్నీని చాలామంది టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ పక్కకు పెడుతున్నారు అన్న గాసిప్పుల హడావిడి ఇండస్ట్రీ వర్గాలలో ప్రస్తుతం జరుగుతోంది. ఈగాసిప్పులు ఇలా రావడానికి కొన్ని ఆసక్తికరకారణాలు ఉన్నాయి. ‘బాహుబలి 2’ ఘన విజయం తరువాత రాజమౌళి తీయబోయే భారీప్రాజెక్ట్ లో స్థానం సంపాదించుకోవాలని అల్లుఅర్జున్ ఎన్నో ప్రయత్నాలు చేసాడు అన్నవార్తలు ఉన్నాయి.

 ALLUARJUN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

అయితే రాజమౌళి తన మల్టీస్టారర్ కు జూనియర్ చరణ్ లపై మొగ్గు చూపెట్టాడు కానీ అల్లుఅర్జున్ పట్ల పెద్దగా ఆసక్తి కనపరచలేదు అన్నకామెంట్స్ ఇప్పటికే ఉన్నాయి. దీనితరువాత బన్నీ దృష్టి కొరటాల శివ పై పడింది అన్నవార్తలు వచ్చాయి. నిర్మాత దిల్ రాజ్ సహకారంతో కొరటాలను బన్నీ తన తదుపరి సినిమాగురించి ప్రయత్నాలు చేస్తే కొరటాల కూడ బన్నీతో సినిమాచేయడానికి పెద్దగా ఆసక్తి కనపరచలేదు అన్నగాసిప్పులు కూడ ఉన్నాయి.

 ALLUARJUN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

అదేవిధంగా అల్లుఅర్జున్ త్రివిక్రమ్ గురించి ఆలోచిస్తే అతడు ఇప్పటికే జూనియర్ వైపుకు వెళ్ళిపోయాడు. ఇక వంశీ పైడిపల్లి సుకుమార్ లు కూడ తమ భవిష్యత్ సినిమాలకు సంబంధించి మహేష్ వైపు చూస్తున్నారు. దీనితో అల్లుఅర్జున్ వైపు ప్రస్తుతం చూస్తున్న ఒక్క టాప్ డైరెక్టర్ కూడ లేడు అన్నప్రచారం జరుగుతోంది. దీనికి కారణం బన్నీ వ్యవహార శైలి అనిఅంటున్నారు.

 

అల్లు అర్జున్ తనసినిమాల స్క్రిప్ట్ విషయంలో అదేవిధంగా ఆసినిమాలకు సంబంధించిన సీన్స్ చిత్రీకరించే విషయంలో ఈమధ్య దర్శకులకు ఎక్కువగా సలహాలు పాఠాలు చెపుతున్న నేపధ్యంలో ఇటువంటి క్లాసులు భరించే ఓపిక తీరికా లేక చాలామంది టాప్ దర్శకులు బన్నీ పేరు చెపితే భయపడి పోతున్నారు అని టాక్. బన్నీ ఈమధ్య నటించిన ‘సరైనోడు’ ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాల విషయంలో ఆమూవీ దర్శకులకు తెగ సలహాలు ఇచ్చాడు అనివార్తలు వచ్చిన నేపధ్యంలో ప్రస్తుతం బన్నీ పట్ల టాప్ డైరెక్టర్స్ ఎవరూ ఆసక్తి కనపరచడం లేదు అన్నవార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈటాప్ డైరెక్టర్స్ అందరు తమతమ సినిమాలతో బిజీగా ఉన్నారని అందువల్లనే బన్నీ సినిమాలు చేయడంలేదు కానీ కారణాలు ఇవేమీ కావు అంటూ బన్నీ సన్నిహితులు ఈ గాసిప్పులను ఖండిస్తున్నారు..  

 


మరింత సమాచారం తెలుసుకోండి: