ఒకప్పుడు బాలీవుడ్ లో హీరో, విలన్, దర్శక, నిర్మాతగా అన్ని రంగాల్లో తనదైన ప్రతిభ చూపించిన రాకేష్ రోషన్ తనయుడు హృతిక్ రోషన్ 1980వ దశకంలో కొన్ని సినిమాల్లో బాలనటునిగా ఎంటీ ఇచ్చాడు.  2000 లో తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ‘ కహో నా.. ప్యార్ హై’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 
Related image
హృతిక్ ఫిజిక్, డ్యాన్స్, పర్పామెన్స్ కి బాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు.  ఆ తరువాత ఫిజా (2000), మిషన్ కాశ్మీర్ (2000) వంటి సినిమాల్లో నటించిన ఆయన కభీ ఖుషీ కభీ గమ్ (2001) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం సాధించకున్నా..సైన్స్ ఫిక్షన్ కోయీ.. మిల్ గయా (2003) సినిమాతో తిరిగి విజయాన్ని పొందారు.
Image result for hrutik roshan rakesh roshan
ఈ సినిమాలోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారాన్ని కూడా అందుకున్నారు. క్రిష్ (2006) సినిమా ఈ చిత్రానికి సీక్వెల్ గా నిర్మించినదే. ఆయన కెరీర్ లోని మూడవ ఫిలింఫేర్ పురస్కారం ధూమ్2 (2006) సినిమాతో అందుకున్నారు . హృతిక్ స్టేజ్ పర్ఫార్మెన్స్ లు కూడా ఇచ్చారు. చాలా బ్రాండ్లకు, ఉత్పత్తులకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు హృతిక్. జస్ట్ డాన్స్ అనే డాన్స్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. తాజాగా ఆసియన్‌ సెక్సియస్ట్‌ మేన్, మేన్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌’ వంటి టైటిల్స్‌ దక్కించుకున్న బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ తాజాగా మరో అరుదైన టైటిల్‌ సొంతం చేసుకున్నారు.
Image result for hrithik roshan body
ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్‌ ఇచ్చిన ‘వరల్డ్‌ టాప్‌ టెన్‌ హ్యాండ్సమ్‌ హీరో’ల ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచారు ఈ ఆరడుగుల అందగాడు.  ప్రముఖ హాలీవుడ్‌ నటులు రాబర్ట్‌ ప్యాటిన్సన్, క్రిస్‌ ఇవాన్స్‌లను వెనక్కి నెట్టి మరీ తొలి స్థానంలో నిలవడం విశేషం. ఇంతవరకూ ఏ భారతీయుడూ సాధించని ఘనతను హృతిక్‌ సాధించాడంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు హృతిక్‌ని అభినందిస్తున్నారు.  ఇక  బాలీవుడ్‌ హీరో, కండల వీరుడు సల్మాన్‌ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు.



మరింత సమాచారం తెలుసుకోండి: