నంద‌మూరి నటసింహం బాలకృష్ణ న‌టించిన 102వ సినిమా జై సింహా ఈ సంక్రాంతికి వ‌చ్చిన అన్ని సినిమాల కంటే పై చేయి సాధించింది. జై సింహా బీ, సీ సెంట‌ర్ల‌తో పాటు మాస్ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది. తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ 8.25 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ సినిమా 5 రోజులకుగాను ప్రపంచవ్యాప్తంగా రూ.23. 93 కోట్లను వసూలు చేసింది.
Image result for jai simha posters
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.19.07 కోట్లను రాబట్టిన ఈ చిత్రం కర్ణాటలో రూ.2.76 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 80 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.1.3 కోట్లు వసూలు చేసింది. ఫ‌స్ట్ వీక్ ముగిసే స‌రికి జై సింహా డిస్ట్రిబ్యూట‌ర్లు లాభాల బాట ప‌ట్ట‌నున్నారు.

Image result for jai simha posters

ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ ఏరియా క‌లెక్ష‌న్లు ఇలా ఉన్నాయి... (రూ.కోట్ల‌లో)
నైజాం - 3.63
సీడెడ్ - 4.47
ఉత్త‌రాంధ్ర - 2.16
గుంటూరు - 2.07
ఈస్ట్ - 1.76
వెస్ట్ - 1.52
కృష్ణా - 1.28
నెల్లూరు - 0.98
రెస్టాఫ్ ఇండియా - 1.75
క‌ర్ణాట‌క - 2.76
ఓవ‌ర్సీస్ - 0.75
-------------------------
టోట‌ల్ = 23.93
------------------------
ఇక జై సింహా వ‌ర‌ల్డ్ వైడ్ టోట‌ల్ ప్రి రిలీజ్ బిజినెస్‌లో థియేట్రిక‌ల్ రైట్స్ రూ.27 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. సినిమాను చాలా ఏరియాల్లో నిర్మాత సీ క‌ళ్యాణ్ సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. మ‌రో రూ.4 కోట్ల వ‌స్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌లోకి వ‌చ్చేయ‌నుంది. ఫ‌స్ట్ వీక్ ముగిసే స‌రికే జై సింహా బ్రేక్ ఈవెన్‌కు వ‌చ్చేసి.... సెకండ్ వీక్ నుంచి లాభాల్లోకి వ‌చ్చేయ‌నుంది. ఇక రిప‌బ్లిక్ డే వ‌ర‌కు స‌రైన సినిమా లేక‌పోవ‌డంతో జై సింహా వార్ వ‌న్‌సైడ్ కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: