కోలీవుడ్ స్టార్ హీరో సూర్య న‌టించిన లేటెస్ట్ సినిమా గ్యాంగ్‌. విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అయ్యింది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాను తెలుగులో స్టూడియో గ్రీన్‌తో పాటు యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా రిలీజ్ చేశాయి. తెలుగులో ఈ సంక్రాంతికి ప‌వ‌న్ అజ్ఞాత‌వాసి, బాల‌య్య జై సింహా లాంటి రెండు ప్రెస్టేజియ‌స్ సినిమాలు రిలీజ్ అయినా కూడా గ్యాంగ్ వ‌చ్చింది.


మ‌రో షాక్ ఏంటంటే ఈ సంక్రాంతికి వ‌చ్చిన సినిమాల‌న్నింటికిలోకి గ్యాంగ్‌కే మంచి రివ్యూలు రావ‌డంతో పాటు టాక్ వ‌చ్చింది. తొలి రోజు చాలా త‌క్కువ వ‌సూళ్లు రాబ‌ట్టిన గ్యాంగ్ రెండో రోజు, మూడో రోజు నుంచి క్ర‌మ‌క్ర‌మంగా పుంజుకుంది. తొలి రోజు 0.86 ల‌క్ష‌లు రాబ‌ట్టిన ఈ సినిమా 5 రోజుల‌కు 4.56 కోట్లు కొల్ల‌గొట్టింది.


గ్యాంగ్ 5 డేస్ ఏరియా వైజ్ షేర్‌ (రూ.కోట్ల‌లో)
నైజాం - 1.38
సీడెడ్ - 0.73
ఉత్త‌రాంధ్ర - 0.70
గుంటూరు - 0.62
ఈస్ట్ - 0.27
వెస్ట్ - 0.27
కృష్ణా - 0.36
నెల్లూరు - 0.23
------------------------------------ 
ఏపీ+తెలంగాణ = 4.56 కోట్లు
-------------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: