అజ్ఞాతవాసి’ బయ్యర్లకు సుమారు 70 కోట్ల వరకు నష్టాలు వస్తాయి అన్నవిషయం ఖరారు కావడంతో ఈనష్టాలను ఎలాపూడ్చుకోవాలి అన్న టెన్షన్ లో ఆసినిమా బయ్యర్లు ఉన్నారన్న విషయంతెలిసిందే. అయితే ‘అజ్ఞాతవాసి’ ఘోరపరాజయం మరో 300 కోట్ల బిజినెస్ కు సమస్యగా మారడం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో హాట్ న్యూస్ గా మారింది. ‘బాహుబలి’ తరువాత తెలుగుసినిమాల మార్కెట్ విపరీతంగా పెరిగిపోవడంతో గ ఏడాది ‘స్పైడర్’ వందకోట్ల బిజినెస్ ను దాటిన సినిమా అయితే ఈఏడాది ప్రారంభంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ 150 కోట్ల బిజినెస్ ను చేసింది.

 RANGASTHALAM MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

 

ఇప్పుడు రాబోతున్న సమ్మర్ ను టార్గెట్ చేస్తూ మరోమూడు భారీసినిమాలు రాబోతున్నాయి. ఈమూడు సినిమాల మొత్తం బిజినెస్ ను లెక్కలోకి తీసుకుంటే 300 కోట్లు దాటిపోతుంది.  రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న ‘రంగస్థలం’ అన్నీ కలుపుకుని 110 కోట్లవరకు బిజినెస్ చేసింది అన్నవార్తలు వస్తున్నాయి. వరస పరాజయాలలో ఉన్నా వాటిని లెక్కచేయకుండా మహేష్ నటిస్తున్న ‘భరత్ అనే నేను’ మూవీ బిజినెస్ ఆఫర్లు కూడ ఇప్పటి వరకు 120 కోట్ల బిజినెస్ కు దరిదాపుల్లో ఉన్నాయి అన్ వార్తలు వస్తున్నాయి.

 

 ALLU ARJUN NAA PERU SHIVA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇక ఇదే పద్ధతిని అనుసరిస్తూ బన్నీ-వక్కంతం వంశీ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘నా పేరు సూర్య’ మూవీకి సంబంధించిన ఏరియా బిజినెస్ డిజిటల్ శాటిలైట్ అన్నీ కలిపి 110 కోట్ల వరకు మార్కెట్ అయింది అనిచెపుతున్నారు. ఈసినిమా హిందీ తెలుగు శాటిలైట్ రైట్స్ 23కోట్ల 80లక్షలకు అమ్మకం జరిగింది అంటే ఈమూవీ పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్ధంఅవుతుంది. తెలుస్తున్న సమాచారం వరకు ఈమూడు సినిమాలకు సంబంధించి దాదాపు 80శాతం బిజినెస్ పూర్తి అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

 MAHESH BHARAT ANU NENU LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

 

ఈమూడు సినిమాలు రాబోతున్న సమ్మర్ ను టార్గెట్ చేస్తూ వరుసగా మార్చి, ఏప్రియల్, జూన్ ల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే ‘అజ్ఞాతవాసి’ కి వచ్చిన భారీ పరాజయంతో ఈమూడు సినిమాల బయ్యర్లు ఇప్పుడు విపరీతమైన ఆందోళనలో ఉన్నట్లు వార్తలువస్తున్నాయి. ‘అజ్ఞాతవాసి’ పరాజయాన్ని లెక్కలోకి తీసుకోకుండా తాము అంగీకరించిన భారీ మొత్తాలకు ఈమూడు సినిమాలను యధావిధిగా కొని విడుదల చేసుకోవాలా ? లేదంటే ఇచ్చిన అడ్వాన్స్ లతో ఋణం తీరిపోయింది అనుకుని ఆవిషయాలను మరిచిపోయి చరణ్ బన్నీ మహేష్ ల సినిమాల ఎగ్రిమెంట్ ల నుండి బయటపడాలా అన్న అంతర్మధనంలో ఉన్నట్లు టాక్. ఈ నేపధ్యంలో  ‘అజ్ఞాతవాసి’ 300 కోట్ల బిజినెస్ కు సమస్యగా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..   

 


మరింత సమాచారం తెలుసుకోండి: