ఈ మద్య టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా సినీ విశ్లేషకుడు కత్తి మహేష్, పవన్ కళ్యాన్ ఫ్యాన్స్, సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.  ఇక వీరు చేస్తున్నహడావుడి వివిధ చానల్స్ కి మంచి బ్రెక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ లా తయారైంది.  చీటికి మాటికి తమ స్టూడియోలకు పిలవడం..డిబెట్ పెట్టడం..అది కాస్త యూట్యూబ్ లో సంచలనం చేయడం పరిపాటైంది.
Image result for ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’
ఇదిలా ఉంటే..సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ  ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ అంటూ యూట్యూబ్ లో హాట్ హాట్ గా రిలీజ్ చేసి సంచలనం రేపారు.   ”ఒక అమ్మాయి దేవుడు క్రియేట్ చేసిన సెక్స్ అనే ప్రక్రియను ఎంజాయ్ చేయడానికి.. మధ్యలో మానవుల అడ్డుకట్టు ఎందులకు? ఇకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయితోనే ఎందుకు రతిని జరపాలి? ఒకేసారి తనకు నచ్చినట్లు చాలామందితో చేయొచ్చు కదా? వీటన్నింటికీ నాకు పోర్న్ ఇండస్ర్టీ దారి చూపించింది” అంటూ మియా మల్కోవా చాలా గొప్పగా చెప్పడం ఈ ట్రైలర్ లో ప్రధానాంశం.
Image result for ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’
దీనిపై ఇప్పటికే పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఆర్జీవీ రూపొందించిన ‘జీఎస్టీ’ని మెచ్చుకుంటూ కత్తి మహేష్ చేసిన ట్వీట్‌కు కౌంటర్‌గా కౌర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘‘ఇండియాలో సాధారణ భారతీయ యువతులు కంటే పోర్న్ స్టార్లే మంచి జీవితం, గౌరవాన్ని పొందుతున్నారు. ఇక్కడి యువతులు దేనిపైనైనా స్పందిస్తే వారిపై లేనిపోని నిందలు వేస్తు అసభ్యంగా మాట్లాడతారు. అంతా కలిసి ఆ యువతుల ఆత్మ, మనస్సు, శరీరాన్ని చంపేందుకు సిద్ధమవుతారు’’ అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది.

ఇక పూనమ్ కౌర్ ట్విట్ కి నెటిజన్లు మంచి మద్దతు ఇస్తున్నారు. కాగా, ఈ మద్య రాంగోపాల్ వర్మకు కత్తి మహేష్ మంచి సపోర్ట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్జీవీ విడుదల చేసిన ‘జీఎస్టీ’కి కత్తి మహేష్ సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు. ‘‘మియా ఒక దేహం కాదు. విశ్వవ్యాపితమైన ఒక మోహన రూపం. మియా ఒక స్త్రీ కాదు. స్త్రీ లైంగిక స్వేఛ్చా స్వాతంత్ర్యాలకు ప్రతిరూపం.

కొన్ని యుగాలుగా అణచివేయబడ్డ స్త్రీ వాంఛలకు మద్దతుగా మియా మాటల్లో, వర్మ అనే ఒక పురుషుడు విప్పిన గొంతుక ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ అని ట్వీట్ చేశాడు.  అంతే కాదు మరో ట్విట్ లో ‘‘షాక్ వాల్యుని దాటి ముందుకు వెళితే ఎందరో తత్వవేత్తల వేదాంతం. ఎందరో విప్లవకారుల నినాదం ఈ ట్రైలర్ లో వినిపిస్తోంది. వర్మ చెప్తున్నాడు కాబట్టి, అనుమానాస్పదంగా చూడకుండా, ఆబ్జక్టివ్ గా చూస్తే ఒక ప్రాచీన సత్యం గోచరిస్తుంది.

ఒక బలీయమైన, తృణీకరించలేని శారీరక పరమసత్యం అవగతం అవుతుంది ’’ అని పేర్కొన్నాడు. ఈ విషయంపై కత్తి మహేష్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  సామాజికవేత్తవని చెప్పుకుంటున్న నువ్వు ‘పోర్న్’ స్టార్లను ప్రోత్సహిస్తావా? అశ్లీలతకు మద్దతు ఇస్తావా? విలువలు గురించి మాట్లడే నీకు ఇప్పుడు విలువలు గుర్తు రావడం లేదా అంటూ కత్తిపై ప్రశ్నలు గుప్పిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: