‘బాహుబలి’ తో ఆల్ ఇండియా సెలిబ్రిటీగా మారిపోయిన ప్రభాస్ హీరోయిన్ అనుష్కల సాన్నిహిత్యం పై ఎన్నో వార్తలు గతంలో వచ్చాయి. ఆ వార్తలను వీరిద్దరూ అనేకసార్లు ఖండించినా  అనుష్క మీడియా ముందుకు వచ్చిందంటే చాలు ఆమెను ప్రభాస్ తో తన రిలేషన్ షిప్ గురించి ప్రశ్నలు అడుగుతూ ఆమెను ఇరుకున పెడుతూనే ఉంటారు.

  అబ్బాయిని వెతికి పెట్టండి

ఇది ఇలా ఉండగా అనుష్క‘భాగమతి' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం తమిళంలో కూడా విడుదల అవుతోంది. ఈమూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపధ్యంలో చెన్నైలో ఈసినిమాను ప్రమోట్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తోంది అనుష్క. అయితే కోలీవుడ్ మీడియా  ఇంటర్వ్యూలలో అనుష్కను అక్కడి మీడియా వర్గాలు ఆమెను తన పెళ్లి గురించి ప్రభాస్ ప్రస్తావన గురించి చాలా ప్రశ్నలు అడిగి అనుష్కను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించారు.   

 ఐదేళ్ల క్రితమే కథ చెప్పాడు

పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు ? వయసు పైబడుతోంది కదా ఇంకా ఎన్నిరోజులు ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటారు? ప్రశ్నలకు అనుష్క ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది. అంతేకాదు   ‘నాకోసం మీరే ఒక మంచి అబ్బాయిని వెతికిపెట్టండి' అంటూ మీడియా వర్గాలకు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఇదే సందర్భంలో ఆమె  ప్రభాస్‌ గురించి మాట్లాడుతూ తనకు ప్రభాస్ మంచిమిత్రుడు మాత్రమే అంతకు మించి తమ మధ్య ఏమీ లేదు అంటూ కామెంట్స్ చేసింది. తాము ఇద్దరం  కలిసి వరుస సినిమాలకు పనిచేయడం వలన తమ మధ్య స్నేహం బలపడిందని చెపుతూ  ప్రభాస్‌ ను తాను ‘అన్నయ్య’ అని పిలవనేను అందరు అబ్బాయిల్నీ తాను సోదరులుగా భావించ లేను అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది.  

  ఏ విషయం గురించీ ఎక్కువగా ఆలోచించను

అనుష్క ఇచ్చిన ఈరిప్లై మీడియాకు సంచలనంగా మారడమే కాకుండా ఆమె ఇచ్చిన సమాధానాల వెనుక అర్ధాలు ఏమిటి అన్నకోణంలో చర్చలు జరుగుతున్నాయి. ‘భాగమతి' చిత్రంలో  ఒక  ఐఏఎస్‌ అధికారిణి పాత్రలోకనిపిస్తున్న అనుష్క ఈసినిమా ఫ్లాష్ బ్యాక్ లో    ‘భాగమతి' గా ఎలామారింది ? అన్న కధలో అనుష్క అద్భుతంగా నటించింది అని ఈసినిమా  ఫైనల్ ప్రింట్ చూసిన వారు చెపుతున్నారు. ఈ సంక్రాంతి రేస్ కు వచ్చిన సినిమాలు అన్ని ఫెయిల్ అయిన నేపధ్యంలో ఈనెల రిపబ్లిక్ డే రోజున విడుదలకాబోతున్న ఈమూవీ అనుష్క కెరియర్ లో మరో ‘అరుంధతి’ అవుతుంది అని అంటున్నారు..








మరింత సమాచారం తెలుసుకోండి: