గత కొన్నిరోజులుగా మీడియాకు హాట్ టాపిక్ గా మారిన పూనం కౌర్ ఒకేసారి తన లేటెస్ట్ ట్విట్ తో తనను టార్గెట్ చేస్తున్న కత్తి మహేష్ ను రామ్ గోపాల్ వర్మ ప్రస్తావనతో చాల వ్యూహాత్మకంగా ఇరుకున పెట్టింది. ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ కత్తి మహేష్ వివాదంలో అనవసరంగా తల దూర్చి పూనం కౌర్ నానా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. గత కొన్నిరోజులుగా మౌనంగా ఉంటున్న పూనం కౌర్ లేటెస్ట్ గా చేసిన ట్విట్ పైకి రామ్ గోపాల్ వర్మను టార్గెట్ చేస్తూ కనిపించినా అంతర్లీనంగా మాత్రం ఆ ట్విట్ కత్తి మహేష్ ను టార్గెట్ చేసినట్లే కనిపిస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

 

రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ గా ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ పేరిట ఒక లఘు చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈనెల 26 తారీఖునాడు ఈమూవీని సోషల్ మీడియా ద్వారా విడుదల చేయబోతున్నాడు వర్మ. ఈ వ్యవహారం పై ప్రస్తుతం మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది. ఈ సందర్భంలో నిన్న ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ నిర్వహించిన లైవ్ డిబేట్ లో వర్మతో పాటుగా కత్తి మహేష్ కూడ పాల్గొన్నారు. ఈచర్చలో ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చిన సామాజిక ఉద్యమకారిణి దేవి వర్మను కడిగిపారేయడం దానికి వర్మ కూడా ఘాటుగా రిప్లై ఇవ్వడం జరిగింది.

 POONAM KAUR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

 

ఈ టీవీ లైవ్ షో ముగిసిన కాసేపటికి  ట్విట్టర్ లో ప్రత్యక్షమైంది పూనం. ఈవ్యవహారం పై తనదైన రీతిలో స్పందిస్తూ ‘భారతదేశంలో సాధారణ యువతుల కంటే పోర్న్ స్టార్స్ చాలా గౌరవాన్ని పొందుతూ మంచి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఒకవేళ సాధారణ యువతులు దేనిపై అయినా స్పందిస్తే మాత్రం సంబంధం లేని విషయాలను అంటగడుతూ లేని పోని నిందలు వేస్తున్నారు ఒక రకంగా అంతా కలిసి యువతుల ఆత్మను మనసును శరీరాన్ని చంపేసే ప్రయత్నం చేస్తున్నారు’  అని పూనం తనదైన శైలిలో కామెంట్ చేసింది.

 RAMGOPAL VARMA ALONG WITH KATTHI MAHESH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇప్పుడు పూనం చేసిన ఈ ట్విట్ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ట్విట్ ను పరిశీలించిన కొందరైతే ఈ ట్విట్ లో పూనం వేసిన చురకలు వర్మతో పాటు కత్తి మహేష్ కు కూడ వర్తిస్తాయి అంటూ మరో అర్ధాలను బయటకు తీస్తున్నారు. మరి ఇప్పటికే స్నేహితులుగా మారిపోయిన వర్మ, కత్తిమహేష్ లు పూనం కౌర్ కు ఎలాంటి రివర్స్ ట్విస్ట్ ఇస్తారో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: