సంక్రాంతి సినిమాల హడావుడి ముగిసిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి వచ్చేవారం 26న రిపబ్లిక్ డే ని టార్గెట్ చేస్తూ విడుదలకాబోతున్న సినిమాల పై పడింది. ఈ రిపబ్లిక్ డేని కలుపుకుని వరస పెట్టి వస్తున్న మూడు సెలవులను క్యాష్ చేసుకోవాలని చాలామంది దర్శక నిర్మాతలు హీరోలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో ప్రధమ స్థానంలో కొనసాగుతోంది అనుష్క ‘భాగమతి’. ‘బాహుబలి 2’ విడుదల తరువాత విడుదల కాబోతున్న అనుష్క మూవీ కావడంతో ఈమూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

 QANUSHKA IN BAGHAMATHY MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

 

దీనికితోడు ఈమూవీ టీజర్ కు ఇప్పటికే చాల భారీ స్థాయిలో స్పందన రావడంతోపాటు అత్యంత భారీ స్థాయిలో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ‘భాగమతి’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది అని వార్తలు వస్తున్నాయి. బయటకు లీక్ అవుతున్న సెన్సార్ టాక్ ప్రకారం ఈ సినిమాలో ఫస్టాఫ్ అంతా కూడా కథను ఎస్టాబ్లిష్ చేయడానికి సరిపోగా సినిమాలో సెకండాఫ్ మాత్రం అదిరిపోయిందట.

 QANUSHKA IN BAGHAMATHY MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

అనుష్క ‘భాగమతి’ గా సెకండ్ ఆఫ్ లో కనిపించడం మొదలు పెట్టడం నుంచి ఈమూవీ రేంజ్ మరొక స్థాయికి చెరుకుపోతుంది అని ఈమూవీని చూసినవారు బయటకు లీకులు ఇస్తున్నారు. ముఖ్యంగా ఈమూవీ సెకండ్ ఆఫ్ లో 20 నిమిషాలు పాటు వచ్చే అనుష్క యాక్షన్ ఎపిసోడ్ దానికి సంబంధించిన గ్రాఫిక్స్ ఈసినిమాకు గుండెకాయగా మారుతాయి అన్న మాటలు వినిపిస్తున్నాయి.

 QANUSHKA IN BAGHAMATHY MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

సంక్రాంతి రేసులో పవన్ బాలకృష్ణలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొడతారు అని అందరూ ఆశిస్తే ఆ అంచనాలను వారిద్దరు నిలుపుకోలేకపోయారు. దీనితో 2018లో తొలి హిట్ కొట్టే రికార్డ్ అనుష్కకు దక్క పోతోంది అంటూ అప్పుడే ప్రచారాలు మొదలైపోయాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: