టాలీవుడ్ చరిత్రలో నష్టాల విషయంలో చరిత్రను సృష్టించిన ‘అజ్ఞాతవాసి’ ఘోర పరాజయంతో అయోమయంలో పడిపోయిన పవన్ దృష్టి కొంతకాలం క్రితం తనను దృష్టిలో పెట్టుకుని దాసరి నారాయణరావు వ్రాసిన ఒక పవర్ ఫుల్ స్టోరీ పై పడింది అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఇదే కథను దాసరి పవన్ తో తీయాలని ఆయన జీవించి ఉన్నప్పుడు చాల సార్లు ప్రయత్నించారు అని చాలామంది అంటారు.

PAVAN KALYAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

 

అయితే ఆ కథ సినిమాగా మారకపోయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను కష్టాల నుండి గట్టేక్కించే బ్రహ్మాస్త్రంగా మారబోతోంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు ప్రారంభం అయ్యాయి. ఈ పవర్ ఫుల్ స్టోరీకి దర్శకత్వం వహించే సమర్దత బోయపాటి శ్రీనుకు తప్ప మరెవ్వరికీ లేదు అని పవన్ భావిస్తున్న నేపధ్యంలో ఇప్పటికే పవన్ కాంపౌండ్ నుండి బోయపాటి శ్రీనుకు పిలుపు వెళ్ళినట్లు టాక్.

 BOYAPATI ALONG WITH PAVAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఫిలిం నగర్ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈ వారంలోనే బోయపాటి పవన్ ల మధ్య ఈ మూవీ స్క్రిప్ట్ కు సంబంధించి చర్చలు జరగబోతున్నాయి అంటూ ఒక ప్రముఖ మీడియా సంస్థ వార్తలను లీక్ చేస్తోంది. అయితే ఇప్పటికే బోయపాటి రామ్ చరణ్ సినిమా మధ్య చిక్కుకున్న నేపధ్యంలో బోయపాటి పవన్ ల కాంబినేషన్ కోసం చరణ్ త్యాగం చేస్తాడా ? లేదంటే ఈ కాంబినేషన్ ను వాస్తవరూపంలో తీసుకురావడానికి మరే మార్గం అయినా ఆలోచిస్తారా అన్న విషయం పై రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వస్తున్నాయి.

AGNATHAVASI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం 

ఇది ఇలా ఉండగా ‘అజ్ఞాతవాసి’ కలక్షన్స్ అత్యంత హీన స్థితికి దిగజారాయి అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈసినిమాకు వచ్చిన నెట్ కలక్షన్స్ 60 కోట్లు కూడ దాటక పోవడంతో అయోమయంలో పడ్డ ఈ మూవీ బయ్యర్లు పవన్ వైపు చూస్తున్నట్లు టాక్. ప్రస్తుతం రాజకీయాలలో ఉన్న పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ బయ్యర్లకు ఎదో విధంగా న్యాయం చేయకపోతే ఆ ప్రభావం పవన్ భవిష్యత్ లో వచ్చే సినిమాల మార్కెట్ పైనే కాకుండా పవన్ రాజకీయాల పై కూడ ఉంటుంది అంటూ విశ్లేషకులు స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు..    

 


మరింత సమాచారం తెలుసుకోండి: