తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ తనయుడు రాంచరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు.  మొదటి సినిమా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘చిరుత’ లో నటించినా పెద్దగా పేరు రాలేదు..కానీ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మగధీర’ తో రాంచరణ్ రికార్డుల మోత మోగించాడు.  డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్ లో తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న రాంచరణ్ నటించిన సినిమాలు తక్కువే అయినా..దాదాపు అన్నీ సూపర్ డూపర్ హిట్ సినిమాలు కావడం విశేషం.  గత సంవత్సరం ‘ధృవ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో నటిస్తున్నారు. 

చరణ్ సరసన సమంత నటిస్తుంది. మరో ముఖ్యపాత్రలో యాంకర్ అనసూయ, ఆదిపినిశెట్టి నటిస్తున్నారు.  ఇప్పటికే రంగస్థలం షూటింగ్ దాదాపుగా పూర్తి కావటంతో తరువాతి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు చరణ్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన కొత్త సినిమాను శుక్రవారం మొదలు పెట్టాడు.   ఇటీవల ఈ సినిమాపై రకరకాల వార్తలు టాలీవుడ్ లో హల్‌చల్‌ చేశాయి. ఈ సినిమా మల్టీ స్టారర్‌ జానర్‌లో తెరకెక్కనుందన్న టాక్ తో పాటు సినిమా ఆగిపోయిందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ రూమర్స్‌కు చెక్‌ పెడుతూ కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చాడు.
Image result for boyapati ram charan
నేడు హైదరాబాద్ గచ్చిబౌలి లోని వనదేవత అమ్మవారి గుడిలో కొట్టిన ముహూర్తపు షాట్ తో ప్రారంభం అయింది. ఈ చిత్రం లో రామ్ చరణ్ కు జోడిగా బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. సరైనోడు చిత్రానికి ఫోటోగ్రఫీ అందించిన రిషి పంజాబీనే తీసుకున్నారు బోయపాటి. సరైనోడు విజువల్ గ కూడా మంచి మార్కులు సంపాదించిన విషయం తెలిసిందే. 
Image result for devisri prasad boyapati
ఇక పోతే సంగీతం మొదట థమన్ కు అప్పగిద్దాం అనుకున్నారట కానీ దర్శకులు బోయపాటి కోరిక మేరకు దేవి శ్రీ ప్రసాద్ నే తీసుకున్నారట.  ఈ సినిమాలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ విలన్‌గా కనిపించనున్నారు. తమిళ నటుడు ప్రశాంత్, నటి స్నేహ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: