టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రియ స్నేహితులుగా పేరుగాంచిన పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల మధ్య కొన్ని విషయాలలో సారుప్యత చాల స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయనాయకుడుగా అనునిత్యం ప్రజల మధ్య ఉండవలసిన పవన్ జనం మధ్య కలిసిపోయి తిరగడానికి పెద్దగా ఆసక్తి కనపరచాడు. అదేవిధంగా నిర్మాతలతో హీరోలతో మీడియాతో అనునిత్యం సన్నిహిత సంబంధాలు తన కెరియర్ నిమిత్తం కొనసాగించవలసిన త్రివిక్రమ్ బయట కూడ తన మాటలను చాలపొదుపుగానే వాడుతూ ఉంటాడు.అందుకే చాలామంది త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి కామెంట్స్ చేస్తూ తన పనేమిటో తాను అన్నట్లుగా త్రివిక్రమ్ వ్యవహరిస్తూ ఉంటాడు కానీ ఎవరితోనూ సంబంధ బాంధవ్యాలు పెట్టుకోడు అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. పట్టుమని పదిమందితో కూడ త్రివిక్రమ్ ఫిలిం ఇండస్ట్రీ వారితో సన్నిహితంగా ఉండడు అంటూ ఆయన సన్నిహితులే కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇదే పరిస్థితి పవన్ కళ్యాణ్ ది కూడ.

 PAVAN KALYAN ALONG WITH TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

దీనితో టాలీవుడ్ ఇండస్ట్రీ ఏకాంత వాసులుగా పవన్ త్రివిక్రమ్ లకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడిపోయింది. లేటెస్ట్ గా ‘అజ్ఞాతవాసి’ ఘోర పరాజయం తరువాత త్రివిక్రమ్ మొత్తంగా తన ఇంటికే పరిమితం అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం త్రివిక్రమ్ తన అత్యంత సన్నిహితులతో కూడా మాట్లాడటంలేదని తిరిగి త్రివిక్రమ్ మళ్ళీ ఎప్పుడు రీచార్జ్ అయి పూర్వపు త్రివిక్రమ్ గా మారుతాడో తెలియని పరిస్థితి ఏర్పడింది అంటూ ఆయన సన్నిహితులే కామెంట్స్ చేస్తున్నట్లు టాక్.

 PAVAN KALYAN ALONG WITH TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

పవన్ కళ్యాణ్ తన ఫాంహౌస్ లో ఏకాంతవాసం అందరికీ తెలిసిన విషయమే అయినా ప్రస్తుతం పవన్ తన సన్నిహిత మిత్రులను కుటుంబ సభ్యులను కూడ కలవడానికి పెద్దగా ఇష్టం కనపరచడం లేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆఖరికీ ఆయన వ్యక్తిగత అవసరాలను చూసే తన వ్యక్తిగత స్టాఫ్ ను కలవడానికి కూడ పవన్ ఏమాత్రం ఆసక్తి కనపరచడం లేదు అని అంటున్నారు.  

PAVAN KALYAN ALONG WITH TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం 

వాస్తవానికి ‘అజ్ఞాతవాసి’ విడుదల తరువాత పవన్ తన రాజకీయ కార్యకలాపాల పై స్పీడ్ పెంచుతాడు అని ఆయన సన్నిహితులు భావించారు. దీనికితోడు తన ‘అజ్ఞాతవాసి’ ని తన ఫ్యాన్స్ కూడ సరిగ్గా చూడలేదు అన్న అభిప్రాయం పవన్ కు ఉన్నట్లు టాక్. దీనికితోడు కత్తి మహేష్ పవన్ అభిమానుల మధ్య రగులుతన్న మంట తారాస్థాయికి చేరిన నేపధ్యంలో ఈసమస్యను ఎలా పరిష్కరించాలో అర్ధంకాని అయోమయంలో పవన్ పడినట్లు తెలుస్తోంది. ఎన్నికల కాలం వేగంగా సమీపిస్తున్న నేపధ్యంలో పవన్ ఇలా తన ఏకాంతవాసాన్ని రోజులకొద్దీ కొనసాగించుకుంటూపోతే  ఈ ఏకాంతవాసానికి పవన్ భారీ మూల్యం చెల్లించు కోవలసిన పరిస్థుతులు ఏర్పడతాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు..

 


మరింత సమాచారం తెలుసుకోండి: