విలక్షణ నటుడు మోహన్ బాబు ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్ 2018లో అతిధిగా పాల్గొన్న సందర్భంగా మీడియావర్గాలతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఈకార్యక్రమంలో పాల్గొన్న మోహన్ బాబును మీడియా ప్రతినిధులు అనేక విషయాల పై ప్రశ్నలు అడిగారు. ఈసందర్భంలో ఒకమీడియా సంస్థ ప్రతినిధి కమలహాసన్ రజినీకాంత్ లతో మోహన్ బాబుకు ఉన్న సాన్నిహిత్యం పై అడిగిన ప్రశ్నకు ఈకలక్షన్ కింగ్ విలక్షణమైన సమాధానం ఇచ్చాడు.

 95 శాతం మంది రాజకీయ నేతలు రాస్కెల్స్

 ‘మీరు రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి వారితో నటించారు కదా ?’ అని అడగగానే మోహన్ బాబుకు విపరీతమైన కోపం వచ్చింది. ‘ఏం మాట్లాడుతున్నావ్ రజనీకాంత్, కమల్ హాసన్ సినిమాల్లో నేను నటించడం కాదు వారే నా సినిమాల్లో నటించారు. మీరు ఇలా మాట్లాడితే ఒప్పుకునేది లేదు’ అంటూ ఆ ప్రశ్న అడిగిన మీడియా ప్రతినిధి పై ఆగ్రహం ప్రదర్శించాడు మోహన్ బాబు.

 MOHAN BABU LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇదే సందర్భంలో మోహన్ బాబు మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా రజనీకాంత్ తనకు మంచి స్నేహితుడు అని అంటూ కమల్ హాసన్‌తో కూడా మంచి అనుబంధం ఉంది అని చెపుతూ తనకు వచ్చిన కోపాన్ని పక్కకు పెట్టి మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఈకార్యక్రమంలో "ఫాదర్ టు డాటర్: డిఎన్ఎ ఆఫ్ యాక్టింగ్" అనే పేరుతో జరిగిన సెషన్‌ లో తన కూతురు మంచు లక్ష్మితో కలిసి పాల్గొన్నాడు. సినిమాలు, రాజకీయాలు వేర్వేరు కావు అని అంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు మోసంచేయడం రాజకీయనాయకులకు అలవాటుగా మారిందని అంటూ రాజకీయ నాయకుల పై ఘాటైన విమర్శలు చేసాడు.

 

అయితే తన స్నేహితుడు తనకు అన్న అయిన ఎన్టీ రామారావు చాలామంచి వ్యక్తి అని చెపుతూ లంచం అంటే ఏమిటో కూడా ఎన్టీఆర్‌కు తెలియదని నందమూరి తారకరామారావు పై ప్రశంసలు కురిపించాడు మోహన్ బాబు. ప్రస్తుతం ఉన్న 95 శాతం మంది రాజకీయ నాయకులు రాస్కెల్స్ అని మోహన్ బాబు వ్యాఖ్యానించడం ఆ కార్యక్రమానికి హైలెట్ గా మారింది. అయితే రానున్న కాలంలో మళ్ళీ రాజకీయాలలోకి మోహన్ బాబు కానీ లేదా ఆయన కుమార్తె మంచు లక్ష్మి కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న ప్రచారం జరుగుతున్న ప్రస్తుత పరిస్థుతులలో మోహన్ బాబు ఇలా రాజకీయ నాయకులను అందర్నీ టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి అన్నకోణంలో చర్చలు జరుగుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: