యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మనస్తత్వం గురించి అతడి పై తరుచూ వచ్చే గాసిప్పుల గురించి రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈరోజు జరుగుతున్న తనపుట్టినరోజు సందర్భంగా ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆశ్చర్యకర కామెంట్స్ చేసాడు. ప్రభాస్ పెళ్లి విషయం పై మాట్లాడుతూ ఒకప్పుడు తాను ప్రభాస్ తో పెళ్లి ప్రస్తావన తెస్తేచాలు ఆమడదూరం పారిపోయేవాడు అని అంటూ ఇప్పుడు పెళ్ళి అంటే కాస్త ఆలోచిస్తున్నాడు అన్న లీకులు ఇస్తున్నాడు కృష్ణంరాజు.

 PRABHAS ALONG WITH KRISHNAM RAJU LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

అయితే పెళ్ళికి మాత్రం సరే అన్నమాట ప్రభాస్ నోటి నుండి ఇంకా రాలేదు అని చెపుతూ ‘బాహుబలి 2’ రిలీజ్ తరువాత పెళ్ళి విషయంలో ప్రభాస్ మనస్తత్వం మారి పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు అంటూ ‘నామాటకు విలువిస్తున్నాడు’ అంటూ కృష్ణంరాజు ప్రభాస్ పై వ్యూహాత్మక కామెంట్స్ చేసాడు. అయితే ప్రభాస్ కు ఇంకా పెళ్లి చేసుకునే మూడ్ రాలేదని  ప్రస్తుతం తాను ప్రభాస్ కోసం అమ్మాయిల్ని వెదకడం లేదని ప్రభాస్ వచ్చి అడిగినప్పడు మాత్రమే సంబంధాలు చూస్తానంటున్నాడు ఈసీనియర్ రెబల్ స్టార్.

 PRABHAS ALONG WITH KRISHNAM RAJU LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇది ఇలా ఉండగా ప్రభాస్ సినిమాల గురించి అదేవిధంగా ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ గురించి కృష్ణంరాజు చేసిన కామెంట్స్ మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ప్రభాస్ వ్యవహారాలు దగ్గరుండి చూసుకునే కృష్ణంరాజుకు అతడు బాలీవుడ్ కు వెళ్తున్నాడనే విషయం తెలియకపోవడం ఆశ్చర్యంగా మారింది. అంతేకాదు ప్రభాస్ తో ‘సాహో’ తరువాత తన గోపీ కృష్ణ మూవీస్ పై సినిమా ఉంటుంది అని లీకులు ఇస్తూ ప్రభాస్ ‘సాహో’ తరువాత బాలీవుడ్ సినిమా చేస్తే తన సొంత బ్యానర్ లో ఎప్పుడు నటిస్తాడు అంటూ కృష్ణంరాజు లాంటి వ్యక్తి ప్రభాస్ పై జోక్ చేయడం హాట్ న్యూస్ గా మారింది.

 PRABHAS ALONG WITH KRISHNAM RAJU LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇప్పటికే ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఖరార్ అయింది అని స్వయంగా ప్రభాస్ చెపుతున్న నేపధ్యంలో ఒకవైపు కృష్ణంరాజు ఒకవిధంగా మరొకవిధంగా ప్రభాస్ భిన్నమైన లీకులు ఇస్తున్న నేపధ్యంలో ప్రభాస్ తీసుకుంటున్న అన్ని నిర్ణయాలు కృష్ణంరాజుకు పూర్తిగా తెలియవా ? అన్న సందేహాలను కొంతమంది వ్యక్త పరుస్తున్నారు. ఏమైనా కృష్ణరాజు పుట్టినరోజు సందర్భంగా తిరిగి ప్రభాస్ పెళ్లి విషయాలు తెరపైకి రావడం ఒకవిధంగా మీడియాకు హాట్ టాపిక్.. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: