ఈ మద్య కొన్ని టివి ఛానల్స్ తమ రేటింగ్ పెంచుకోవడం కోసం రక రకాల జిమ్మిక్కులు చేస్తున్నారు.  అంతే కాదు సెలబ్రెటీలపై కొన్ని కాంట్రవర్సిల్ కామెంట్స్ చేస్త తెగ హంగామా చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో స‌న్ మ్యూజిక్‌లో ప్ర‌సార‌మ‌య్యే 'ఫ్రాంకా సొల్ల‌టా' కార్య‌క్ర‌మంలో యాంక‌ర్లు నివేదిత‌, సంగీత‌లు న‌టుడు సూర్య ఎత్తు గురించి కామెంట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. అమితాబ్ బ‌చ్చ‌న్‌తో సూర్య న‌టించాలంటే కుర్చీ వేసుకోవాల‌ని వారు అన్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.
Image result for HERO SURYA
దీంతో సూర్య ఫ్యాన్స్ అగ్గిలం మీద గుగ్గిలం అయ్యారు..తమ అభిమాన హీరోని ఇంత ఘోరంగా అవమానిస్తారా అంటూ ఫైర్ అయ్యారు.  అంతే కాదు పలువురు సినీ ప్రముఖులు కూడా హీరో సూర్యను అలా కంపైర్ చేయడం మంచిది కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు.  మరోవైపు ఇదే అంశంపై సూర్య ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా యాంక‌ర్ల‌ను బెదిరిస్తూ పోస్టులు, కామెంట్లు చేశారు.
Image result for HERO SURYA FANS TOUCH FOOTS
అంతేకాకుండా ఈరోడ్, న‌మ్మ‌క‌ల్ ప్రాంతాల‌కు చెందిన కొంత‌మంది అభిమానులు స‌న్ టీవీ కార్యాల‌యం ముందు ధ‌ర్నా కూడా చేశారు. దీనిపై స్పందించిన నటుడు సూర్య 'ద‌య‌చేసి మీ విలువైన‌ స‌మ‌యాన్ని, శ‌క్తిని ఉప‌యోగ‌ప‌డే ప‌నుల కోసం వెచ్చించండి. స‌మాజానికి అవ‌స‌ర‌మ‌య్యే ప‌నులు చేయండి' అని ఆయ‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.
Image result for HERO SURYA FANS TOUCH FOOTS
ఇండస్ట్రీలో ఇలాంటి కామెంట్స్ వస్తుంటాయి..అంత మాత్రాన ఫ్యాన్స్ ప్రతి విషయానికి రియాక్ట్ అవుతూ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవొద్దని సూర్య హితవు పలికారు. ఆ మద్య తన ఫ్యాన్స్ కాళ్లపై పడితే..వెంటనే వారి కాళ్లపై పడి ఇలాంటి కాళ్లకు దండం పెట్టే ఆచారం తనకు నచ్చదని అందేకే ఇలా చేశానని ఇక ముందు ఫ్యాన్స్ ఇలా చేయవొద్దని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: