‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయాలి అన్న ఉద్దేశ్యం స్పష్టంగా బయటకు చెప్పకపోయినా ఏమాత్రం అవకాసం చిక్కినా ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయడమే ప్రధాన లక్ష్యంగా మెగా కాంపౌండ్ ‘సైరా’ నిర్మాణ విషయంలో అడుగులు వేస్తోంది. అయితే ఈమూవీని చిరంజీవి మొదలుపెట్టిన నాటినుండి ఈసినిమాకు ఎదురౌతున్న సమస్యలు అనేకం. దీనికితోడు ఈసినిమా విషయంలో చిరంజీవి తీసుకుంటున్న ఎక్కువజాగ్రత్తలు వల్ల ఈమూవీ  నిర్మాణం అతినెమ్మదిగా జరుగుతోంది. ఈసినిమా గురించి రకరకాల గాసిప్పులు ఇప్పటికీ హడావిడి చేస్తూనే ఉన్నాయి.

 MEGASTAR CHIRANGEEVI IN SAIRA MOVIE PHOTOS కోసం చిత్ర ఫలితం

ఈమూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యాక దర్శకుడు సురేందర్ రెడ్డి పనితనం పట్ల అంతగా సంతృప్తి చెందని చిరు పాటలకోసం కృష్ణవంశీని కీలకమైన యాక్షన్ సన్నివేశాల కోసం గుణశేఖర్ ని లైన్ లో పెట్టారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  అయితే గుణశేఖర్ అసలు తనకు మెగా కాంపౌండ్ నుండి ఎటువంటి పిలుపు లేదని ఇప్పటికే లీకులు ఇస్తున్నాడు. ఇదే సమాధానం కృష్ణవంశీ నుండి కూడ అందుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఇలాంటి గాసిఇప్పులు రావడానికి ప్రధానకారణం ఈసినిమాకు సంబంధించి కెమెరామెన్ మార్పు.

 

తొలుత మోషన్ పోస్టర్ రిలీజ్ టైంలో అనౌన్స్ చేసిన రవివర్మన్ తప్పుకోవడం ఆస్థానాన్ని రత్నవేలు రీప్లేస్ చేయటంతో ఈగందరగోళం మొదలు అయింది. దీనికితోడు గత డిసెంబర్ లో హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ ఇవ్వడానికి వచ్చిన ఎఆర్ రెహమాన్ కూడ తాను ‘సైరా’ ప్రాజెక్ట్ చేయలేకపోతున్నట్టు మీడియాకు డైరెక్ట్ గా చెప్పడంతో ఈ గందరగోళం మరింత ముదిరింది. ఈ నేపధ్యంలో నయనతార పై క్లారిటీ లేకపోవడం  రచియితలు సాయి మాధవ్ బుర్రా పరుచూరి మధ్య  ఏర్పడింది అని చెప్పపడుతున్న కమ్యూనికేషన్ గ్యాప్ ‘సైరా’ పై మరింత గాసిప్పులు వచ్చేలా చేసి ఈమూవీ ప్రాజెక్ట్ ను మరింత గందరగోళంలో పడేశాయి.

 CHIRANGEEVI NEW LOOK WITHOUT MOUSTACHE PHOTOS కోసం చిత్ర ఫలితం

దీనితో జరుగుతున్న నెగిటివ్ ప్రచారాన్ని నిశితంగా గమనించిన మెగాస్టార్ చిరంజీవి ఈవిషయం పై తనయూనిట్ సభ్యులు అందరికీ వ్యక్తిగతంగా ఎస్ఎంఎస్ పెట్టాదాని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమూవీ పై వస్తున్న ఏవార్తను వ్యక్తి గతంగా తీసుకోవద్దు అంటూ ఇంత పెద్దప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు ఇలాంటివి రావడం సహజం అంటూ తన యూనిట్ మెంబెర్స్ లో  స్థైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నాడట మెగా స్టార్.  దీనితో ‘సైరా’ కు సంబంధించి ఏర్పడిన సున్నిత సమస్యలను చిరంజీవి చాలా తెలివిగా డీల్ చేసాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. వచ్చేనెల నుండి ఈసినిమాకు సంబంధించి లేటెస్ట్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది అని వార్తలువస్తున్న నేపధ్యంలో చిరంజీవి మెసేజ్ లు మంచి ఫలితాలు సాధించే ఆస్కారం ఉంది..

 


మరింత సమాచారం తెలుసుకోండి: