తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు మోహన్ బాబు నట వారసులుగా మంచు విష్ణు, మనోజ్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  ఆయన నట వారసురాలిగా మంచు లక్ష్మి కూడా పలు సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. కాకపోతే బుల్లితెరపై యాంకర్ గా సత్తా చాటుతుంది. మంచు విష్ణు హీరోగా, కామెడీ కింగ్ బ్రహ్మానందం మరో ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. పద్మజ పిక్చర్స్ బ్యానర్‌పై కీర్తి చౌదరి, కిట్టు ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
Image result for achari-america-yatra-theatrica
ఎస్.ఎస్. తమన్ స్వరపరిచిన ‘స్వామి రా రా’ అనే బీట్‌తో వచ్చిన పాట ప్రేక్షకులతో స్టెప్పులేయించెలా ఉంది.  సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను ఈ రోజు హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.  అలాగే సంక్రాంతి రోజున విష్ణు విడుదల చేసిన మరో పాట ‘చెలియా’ సంగీత ప్రియులను అలరిస్తోంది. అచ్చు రాజమణి సంగీతం సమకూర్చిన ఈ రొమాంటిక్ మెలోడీ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన లిరిక్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. 
Image result for achari-america-yatra-theatrica
జి.నాగేశ్వర్ రెడ్డి, విష్ణుల కలయికలో 'దేనికైనా రెడీ', 'ఈడో రకం ఆడో రకం' వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే. ‘ఆచారి అమెరికా యాత్ర’ కూడా అదే తరహా వినోదాన్ని అందిస్తున్న సినిమా పై భారీ అంచనాలే పెట్టుకున్నారు.  ఈ రోజుల రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే..ఫుల్ లెన్త్ కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అన్ని మేళవించినట్లు కనిసిస్తుంది. 
Related image
 ఈ చిత్రం సాంకేతిక వర్గం:  రచయత: మల్లాది వెంకటకృష్ణ మూర్తి, ఛాయాగ్రాహకుడు: సిద్దార్థ్, ఎడిటింగ్: వర్మ, సంగీతం: ఎస్ ఎస్ థమన్, అచ్చు రాజమణి, మాటలు: డార్లింగ్  స్వామి  ఆర్ట్ : కిరణ్, యాక్షన్ : కనాల్ కన్నన్, బ్యానర్ : పద్మజ  పిక్చర్స్, సమర్పించు :  ఎం ఎల్ కుమార్  చౌదరి, నిర్మాతలు: కీర్తి చౌదరి, కిట్టు స్క్రీన్ ప్లే, దర్శకత్వం : జి నాగేశ్వర రెడ్డి


మరింత సమాచారం తెలుసుకోండి: